భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ అభ్యర్థించారు.
సీబీఐతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలన్న పిటిషన్పై ఈనెల 8న విచారణ చేపట్టాలని శర్మ సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. తొందరేంటని ప్రశ్నిస్తూ... అత్యవసర విచారణ అవసరం లేదని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. తరువాత విచారణ చేపడతామని తెలిపింది.
ఇదీ చూడండి: ఫొని ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే