ETV Bharat / bharat

'హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య రెట్టింపు చేయండి' - 'హైకోర్టు జడ్జిల సంఖ్య రెట్టింపు చేయండి'.

దేశంలోని అన్ని హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య రెట్టింపు చేసేలా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రముఖ న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్. మానవ వనరుల లేమితో భారత న్యాయ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. మూడేళ్లలోపే కేసులు పరిష్కారమయ్యేలా జ్యుడిషియల్ ఛార్టర్ అమలు చేయాలని కోరారు.

Plea in SC seeks direction to Centre, states to double number of judges in HCs, courts
'హైకోర్టు జడ్జిల సంఖ్య రెట్టింపు చేయండి'
author img

By

Published : Dec 28, 2020, 2:49 PM IST

హైకోర్టులు, అనుబంధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మూడేళ్లకు మించి పెండింగ్​లో ఉన్న కేసులను రద్దు చేసేలా జ్యుడిషియల్ ఛార్టర్​ను అమలు చేయాలని పిటిషన్ అభ్యర్థించింది. భాజపా నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అన్ని హైకోర్టులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర హోంశాఖ, కేంద్ర న్యాయ శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం శీతాకాల సెలవుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ప్రాథమిక హక్కు..

కోర్టుల్లో విచారణ ఆలస్యం కావడం ఆర్టికల్ 21కి విరుద్ధమని పిటిషన్​దారు పేర్కొన్నారు. సత్వర న్యాయం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, దాన్ని అణచివేయకూడదని వ్యాఖ్యానించారు.

"సత్వర న్యాయం పొందడం జీవించే హక్కులో భాగం. సరైన, వేగవంతమైన న్యాయం జరగలేదంటే ఈ ప్రక్రియ విఫలమవుతుంది. సమయపాలనతో కూడిన విచారణ జరిగేందుకు జ్యుడిషియల్ ఛార్టర్​ను ప్రవేశపెట్టాలి. (i)విచారణకు ముందే నిందితులపై అణచివేత, జైలు శిక్షను నివారించడానికి (ii) ప్రజల ఆరోపణలను, ఆందోళనలను తగ్గించడానికి (iii) సుదీర్ఘ జాప్యాల వల్ల నిందితుడు తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు దీన్ని ప్రవేశపెట్టాలి."

-అశ్వనీ ఉపాధ్యాయ్, న్యాయవాది, భాజపా నేత

పెండింగ్ కేసులను మూడేళ్లలోగా రద్దు చేయాలని 2009 అక్టోబర్ 25నాటి జ్యుడిషియల్ ఛార్టర్ స్పష్టం చేస్తోందని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. నిందితుడి గౌరవాన్ని నిలబెట్టేందుకు విచారణ త్వరగా ముగించడం అవసరమని స్పష్టం చేశారు. నిందితుడు దోషిగా తేలితే మూడేళ్లలోపే శిక్ష పడుతుందని అన్నారు. మూడేళ్లలో కేసులను పరిష్కరించి.. 2023 లోపు మిగిలిన కేసులను రద్దు చేయాలని అభ్యర్థించారు. లా కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

'నిర్లక్ష్యం చేశారు'

అదే సమయంలో, కేంద్ర, రాష్ట్రాలు సత్వర న్యాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు అశ్వని. భారీగా పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించలేదని అన్నారు. 'పది లక్షల మంది ప్రజలకు కేవలం 20 లోపు న్యాయమూర్తులు ఉన్నారు. 2018 ఈ సంఖ్య 19.78, 2014లో 17.48, 2002లో 14.7గా ఉంది' అని వివరించారు. మానవ వనరుల లేమితో భారత న్యాయ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. యూపీలోని జౌన్​పుర్​లో ఓ ఆస్తి తగాదా కేసు 35 ఏళ్లుగా పెండింగ్​లో ఉందని ఈ సందర్భంగా ఉదహరించారు. బాధితుడు 400 సార్లు కోర్టుకు హాజరయ్యాడు కానీ, న్యాయ మాత్రం ఇంకా జరగలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలోని 25 హైకోర్టుల్లో న్యాయమూర్తుల సామర్థ్యం 1,079 ఉండగా.. అందులో 414 ఖాళీలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.