మహిళలకు చట్టపరంగా కనిష్ఠ వివాహ వయస్సును 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మహిళలపై చూపుతున్న వివక్షను రూపుమాపాలని పిటిషన్లో పేర్కొన్నారు. భాజపా నాయకుడు, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
"మహిళలకు, పురుషులకు వివాహ వయస్సు సమానంగా ఉండాలి. మహిళలకు 18, పురుషులకు 21గా పరిమితులు పెట్టడంలో పాతకాలపు విధానాలే ఉన్నాయి. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదు. మారుతున్న ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వివక్షను రూపుమాపాలి. ఇది లింగ సమానత్వం, లింగ న్యాయం, మహిళల గౌరవానికి భంగం కలిగించేదిగా ఉంది."
- పిటిషన్ సారాంశం
ఇదీ చూడండి: స్వచ్ఛతలో మీ పల్లెకు ఎంత స్కోర్ ఇస్తారు?