ETV Bharat / bharat

'ఆరోగ్య సేతు'​ పేరుతో సైబర్​ మోసగాళ్ల పంజా - Syber crimes through Aarogya setu

లాక్​డౌన్​తో ప్రజలు ఇంటిపట్టునే ఉండటం వల్ల స్మార్ట్​ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ​దీనిని ఆసరాగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు యాప్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

Phishing attacks in name of Aarogya Setu app increasing: Cyber agency
ఆరోగ్య సేతు​ యాప్​ పేరుతో పెరుగుతున్న సైబర్​ మోసాలు
author img

By

Published : May 17, 2020, 9:50 AM IST

మహమ్మారి కరోనా గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఇటీవలే ఆరోగ్యసేతు మొబైల్​ యాప్​ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిని ఆసరాగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు ఆరోగ్య సేతు యాప్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగాదారులకు నకిలీ సందేశాలు పంపించి వారి డేటాను సైబర్​ మోసగాళ్లు దొంగిలిస్తున్నారని జాతీయ సైబర్​ భద్రతా విభాగం తెలిపింది.

అనుమానం రాకుండా..

వినియోగాదారులకు అనుమానం రాకుండా.. వారి డేటాను దొంగిలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్​సైట్​కు అనుసంధానం చేస్తున్నారు.

"ఆరోగ్యసేతు పేరుతో మోసాలు భారీగా పెరిగిపోయాయి. సైబర్​ నేరగాళ్లు మానవ వనరుల విభాగాధిపతి లేదా సీఈఓలా వ్యవహరిస్తారు. ఆపై 'మీ పొరుగువారు కరోనా బారిన పడ్డారు, మీ చుట్టు పక్కల వైరస్​ ఎంతమందికి సోకిందో తెలుసుకోండి, మీతో సంబంధం ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చింది, స్వీయ నిర్బంధంలో ఉండండి, ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించడానికి​ ఈ మార్గదర్శకాలను పాటించండి,' అంటూ సందేశాలు పంపి వినియోగాదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు."

-కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీం ఆఫ్ ఇండియా

ఆరోగ్య సేతు పేరిట వచ్చిన ఫేక్​ మెసేజ్​లలోని లింకులు క్లిక్ చేస్తే ప్రభుత్వ వెబ్​సైట్లనే పోలి ఉన్న నకిలీ వెబ్​సైట్లు ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించి, దుర్వినియోగం చేస్తున్నారు మోసగాళ్లు.

ఇదీ చూడండి: వలసయేతర కూలీల ఆదాయంపైనా లాక్​డౌన్​ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.