ETV Bharat / bharat

కరోనా భూతంపై జనభారతం ఐక్య పోరాటం - corona

కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని ప్రజలంతా ఐకమత్యంగా ఉన్నారని చాటిచెప్పారు. ప్రధాని పిలుపు మేరకు కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లలో ఆదివారం రాత్రి 9గంటలకు లైట్లను ఆపి.. కొవ్వొత్తులను, దీపాలను, దివ్వెలను వెలిగించి భారతీయుల సంకల్పాన్ని చాటి చెప్పారు.

People light earthen lamps and candles in the balcony of their houses in Bengaluru. PM Modi had appealed to all to switch off all lights of their houses today at 9 PM for 9 minutes&just light candles&diyas, to mark the fight against
జ్యోతిని వెలిగిస్తున్న మోదీ
author img

By

Published : Apr 5, 2020, 9:32 PM IST

Updated : Apr 5, 2020, 10:51 PM IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో యావత్​ భారత దేశం ఒక్కతాటిపై ఉందని రుజువు చేశారు కోట్లాది మంది ప్రజలు. ప్రధాని పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సరిగ్గా రాత్రి 9గంటలకు తమ ఇళ్లలో లైట్లు ఆపి.. కొవ్వొత్తులు, దివ్వెలు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించారు. ఐకమత్యం, సంకల్ప బలంతో ముందుకు సాగి మహమ్మారిపై విజయం సాధిస్తామని చాటి చెప్పారు.

ప్రధాని మోదీ తన నివాసంలో జ్యోతిని వెలిగించి ప్రజలకు సంఘీభావం తెలిపారు. మోదీ తల్లి కూడా తన నివాసంలో దీపాలను వెలిగించారు.

కరోనా భూతంపై జనభారతం ఐక్య పోరాటం
People light earthen lamps and candles in the balcony of their houses in Bengaluru. PM Modi had appealed to all to switch off all lights of their houses today at 9 PM for 9 minutes&just light candles&diyas, to mark the fight against
దీపాలను వెలిగిస్తూ ప్రధాని మోదీ తల్లి

ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా రాష్ట్రపతి రామ్​నాధ్ కోవింద్​ కుటుంబ సమేతంగా దీపాలను వెలిగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షా తన నివాసంలో దీపాలను వెలిగించారు.

కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించారు ఉపరాష్ట్రపతి దంపతులు. పరిస్థితులు చక్కబడే వరకూ కరోనా పై పోరుకు ప్రతి నెలా 30 శాతం వేతనాన్ని విరాళంగా ప్రకటించారు వెంకయ్య నాయుడు. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి అవుతున్న అసత్య సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించారు.

vice president
దీపాలను వెలిగిస్తున్న ఉపరాష్ట్రపతి దంపతులు

దేశ ప్రజలకు శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చేందుకే..

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో 21రోజుల లాక్​డౌన్​ విధించిన అనంతరం ప్రధాని మోదీ రెండోసారి ప్రజలనుద్దేశించి శుక్రవారం వీడియో సందేశమిచ్చారు. జనతా కర్ఫ్యూతో భారతీయులు తమ శక్తి సామర్థ్యాలు చాటారని కొనియాడారు. ప్రజలంతా ఏకమై భారత్​లో కరోనాను తరిమికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధంగా దీపాలను వెలిగించడం వల్ల సంకట సమయంలో భారతీయులకు శ్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.

విద్యుత్ గ్రిడ్ భద్రం...

దేశవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేస్తే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదముందన్న వాదనలు వినిపించాయి. అయితే... అలాంటిదేమీ జరగలేదని, గ్రిడ్ పని తీరుపై ఎలాంటి ప్రభావం పడలేదని కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్కే సింగ్​ స్పష్టంచేశారు.

Last Updated : Apr 5, 2020, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.