ETV Bharat / bharat

పదేళ్ల లక్ష్యం-ప్రజాకర్షక మంత్రం - 5 లక్షల ఆదాయపన్ను

వరాల మూట... ప్రగతి నివేదిక... భవిష్యత్​ ప్రణాళిక... మూడు ముక్కల్లో 'మధ్యంతర బడ్జెట్​' సారాంశం ఇది. 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

పీయూష్​ గోయల్
author img

By

Published : Feb 1, 2019, 7:47 PM IST

కొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు. ఎదురుగా ఎన్నో సవాళ్లు. ఏకమవుతున్న విపక్షాలు. అధికారం ఎవరిదన్నదానిపై లేని స్పష్టమైన అంచనాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాకర్షక మంత్రానికే జైకొట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. మధ్యంతరం అంటూనే వరాల బడ్జెట్ తెచ్చింది. రైతులు, పేద, మధ్యతరగతి, పట్టణ ప్రజలు, ఉద్యోగుల ఓట్లకు గురిపెట్టింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, రైతులకు ప్రత్యక్ష నగదు సాయం వంటి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించింది.

ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ మొత్తం విలువ రూ.27,84,200కోట్లు.

దేశవ్యాప్తంగా 'రైతు బంధు'

దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని దృష్ట్యా మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కర్షకుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఆర్థిక సాయం ప్రకటించింది. 5 ఎకరాలలోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్థికసాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 12కోట్ల మంది రైతులకు లబ్ధిచేకూరుతుందని అంచనా.

పన్నుల ఊరట

2014లో అధికారంలో వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్​లో ఆదాయ పన్ను పరిమితిని పెంచింది మోదీ ప్రభుత్వం. ఆ తర్వాత దాని జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ఒకేసారి రెండున్నర లక్షల నుంచి 5లక్షల రూపాయలకు పన్ను పరిమితిని పెంచింది. పొదుపు, పెట్టుబడులు కలిపి రూ. 6.50 లక్షల వరకు పన్నుల మినహాయింపు ఇచ్చింది. స్డాండర్డ్ డిడక్షన్, టీడీఎస్​ వంటి ఇతర విషయాల్లోనూ వేతన జీవులకు భారీ ఊరట కలిగించేలా ప్రకటనలు చేసింది కేంద్రం.

undefined

పింఛన్ల ప్రకటన

నోట్ల రద్దు, వస్తు-సేవల పన్నుల ప్రత్యక్ష ప్రభావం ఎదుర్కొన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం కొత్త పింఛన్ పథకం తెచ్చింది కేంద్రం. ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్​ధన్ పేరిట కార్మిక పింఛను పథకం ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన కార్మికులందరికీ నెలకు రూ. 3 వేల పింఛన్ అందిస్తామని చెప్పింది.

కీలక రంగాలకు నిధులు పెంపు

గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉన్న రంగాలకు బడ్జెట్​లో సమృద్ధిగా నిధులు కేటాయించింది కేంద్రం. ఉపాధి హామీ పథకం నిధులను 60వేల కోట్లకు పెంచింది.
రక్షణ రంగానికి నిధుల్ని 7శాతం పెంచింది. ఫలితంగా రక్షణ రంగం బడ్జెట్​ 3లక్షల కోట్లు దాటింది. రైల్వే ఛార్జీల జోలికి వెళ్లలేదు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్. రైల్వేకు సంబంధించి ఎలాంటి భారీ ప్రాజెక్టులు ప్రకటించలేదు. ఆధునీకరణపై దృష్టిపెడతామని చెప్పారు.

ప్రగతి నివేదిక

వరాల జల్లుతోపాటు ఐదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని వివరించేందుకు బడ్జెట్​ను ఓ సందర్భంగా ఉపయోగించుకున్నారు గోయల్. ఒక్కో రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయో గణాంకాలతో సహా వివరించారు.

నవలోకం మా స్వప్నం

పదేళ్ల తర్వాత భారత్​ను ఎలా చూడాలనుకుంటున్నారో బడ్జెట్​ ద్వారా వివరించారు గోయల్. ఆ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు అనుసరించనున్నారో వెల్లడించారు.

AP Video Delivery Log - 1100 GMT News
Thursday, 31 January, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1049: Australia Accident Part no access Australia 4193729
Bus crashes into scooter killing two Taiwanese nationals
AP-APTN-1029: Netherlands Nissan AP Clients Only 4193728
Execs meet for first time since chairman unseated
AP-APTN-1023: Belgium Trial AP Clients Only 4193725
Nemmouche trial continues with victim's daughters' testimony
AP-APTN-1017: US Winter Weather Content has significant restrictions, see script for details 4193724
US deep freeze expected to ease on Thursday
AP-APTN-1007: China MOFA Briefing AP Clients Only 4193723
DAILY MOFA BRIEFING
AP-APTN-1002: STILLS France Seat Sala Must credit content creator 4193721
Cushions found likely from Sala's missing plane
AP-APTN-0918: Thailand Greenpeace AP Clients Only 4193717
Greepeace: Combating pollution using drones ineffective
AP-APTN-0905: Venezuela Tension No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4193714
Riot police depoyed ahead of anti-Maduro rallies
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.