దిల్లీ ఎయిమ్స్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అత్యవసర విభాగంలోని రోగులకు ప్రస్తుతం వైద్యసేవలు పునరుద్ధరించారు.
దిల్లీ ఎయిమ్స్ టీచింగ్ బ్లాక్‌లోని మైక్రోబయాలజీ డిపార్టుమెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వైరాలజీ విభాగం పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల ఏబీ-1 వార్డులోని రోగులను ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది 2 గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు.
షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: 'భారత్ - భూటాన్ ఆదర్శప్రాయమైన భాగస్వామ్యం '