ETV Bharat / bharat

'కరోనిల్​' అమ్మకాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​.. కానీ..

పతంజలి ఆయుర్వేద​ సంస్థ తీసుకొచ్చిన కరోనిల్ ఔషధంపై నెలకొన్న సందిగ్ధత వీడింది. కరోనిల్​ అమ్మకాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ. అయితే అది కేవలం ఇమ్యూనిటీ బూస్టర్​గా విక్రయించాలని ఆ సంస్థకు సూచించింది.

Patanjali can sell Coronil
కరోనిల్ అమ్మకాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్
author img

By

Published : Jul 1, 2020, 9:24 PM IST

పతంజలి ఆయుర్వేద సంస్థకు ఆయుష్​ మంత్రిత్వశాఖ ఊరట కల్పించింది. ఆ సంస్థ తయారుచేసిన 'కరోనిల్' ఔషధ అమ్మకాలకు పచ్చజెండా ఊపింది. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధం(ఇమ్యూనిటీ బూస్టర్​)గా మాత్రమే దీనిని విక్రయించాలని స్పష్టం చేసింది ఆయుష్​ మంత్రిత్వశాఖ.

కేంద్ర మంత్రిత్వశాఖతో తమ సంస్థకు ఎలాంటి విభేదాలు లేవని పతంజలి ఆయుర్వేదిక్​ లిమిటెడ్​ వెల్లడించింది. అయితే ఆ ఔషధాన్ని పరిశీలించే వరకు విక్రయాలను ఆపాలని గత వారం కోరినట్లు తెలిపింది.

ఈ విషయంపై స్పందిస్తూ యోగా గురు రామ్​దేవ్ బాబా.. హరిద్వార్​లోని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

'కరోనిల్​ ఔషధాన్ని వాడాలనుకునే వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. మా అమ్మకాలపై ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు. నేటి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు.'

- బాబా రామ్​దేవ్, పతంజలి ఆయుర్వేదిక్​ లిమిటెడ్​

మార్గనిర్దేశాలకు అనుగుణంగానే..

అయితే.. 'కొవిడ్​ ట్రీట్​మెంట్'​ స్థానంలో 'కొవిడ్​ మేనేజ్​మెంట్'​ అనే పదాన్ని ఉపయోగించాలని ఆయుష్​ మంత్రిత్వ శాఖ సూచించిందని రామ్​దేవ్​ బాబా పేర్కొన్నారు. కేంద్ర మార్గ నిర్దేశకాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'అది కరోనా మందు కాదు- ఇమ్యునిటీ బూస్టర్ మాత్రమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.