ETV Bharat / bharat

సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..

భారత్​-చైనా మధ్య ఈ ఏడాది మే నెల నుంచి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తాజా ఘర్షణలకు కేంద్ర బిందువుగా ఉంది తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు ప్రాంతం. గతంలో ఉత్తర తీరంలోని ఫింగర్స్​ ప్రాంతంపైనే వివాదం ఉండగా.. ఇప్పుడు దక్షిణ తీరానికి విస్తరించింది. చైనా దురాక్రమణలకు ప్రయత్నిస్తోన్న ప్రాంతాలు తెలుసుకుందాం..

clashes between India and China
సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..
author img

By

Published : Sep 7, 2020, 5:33 AM IST

భారత్‌- చైనా మధ్య తాజా ఘర్షణలకు కేంద్ర బిందువు పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం. ఇక్కడి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) విస్తృతిపై రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదం ఉంది. ఈ ఏడాది మే నెల నుంచి ఇక్కడ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఉత్తర తీరంలోని ఫింగర్స్‌ ప్రాంతంపైనే వివాదం ఉండగా.. ఇప్పుడు దక్షిణ తీరానికీ రగడ విస్తరించింది.

దక్షిణంపై...

వంచనతో పాంగాంగ్‌ ఉత్తర రేవులో పాగావేసిన చైనా సైన్యం గత నెల 29న అర్ధరాత్రి వేళ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక పర్వత శిఖరాలను కబ్జా చేసేందుకు ముందుకు కదిలింది. డ్రాగన్‌ ఉద్దేశాలను పసిగట్టిన భారత్‌ సైన్యం తానే ముందుగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఉత్తర తీరంలోని చైనా శిబిరాలకు చేరువలో ఫింగర్‌-2, ఫింగర్‌-3 వద్ద ఉన్న ఎత్తయిన ప్రాంతాలపై భారీగా సైన్యాన్ని మోహరించింది. ఉత్తర, దక్షిణ రేవుల్లో మెరుపు మోహరింపుల ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. రెండు కిలోమీటర్ల వెడల్పు కలిగిన కీలక స్పాంగుర్‌ గ్యాప్‌ కూడా భారత అధీనంలోకి వచ్చింది. తాజా వ్యూహంతో దెమ్‌చోక్‌, చుమార్‌ ప్రాంతంలో భారత్‌దే పైచేయిగా ఉంది.

ఉత్తరంవైపే వేళ్లు చూపిస్తున్నాయి..

clashes between India and China
తాజా వివాదం తలెత్తిన ప్రాంతాలు

ఉత్తర తీరంలో ఫింగర్‌- 1 నుంచి 8 వరకూ పర్వతాకృతులు ఉన్నాయి. మొన్నటివరకూ దీనిపైనే భారత్‌, చైనాల మధ్య వివాదం ఉండేది. ఫింగర్‌-8 వరకూ తన భూభాగం ఉందని భారత్‌ వాదిస్తోంది. చైనా మాత్రం ఫింగర్‌-4 సమీపం నుంచి ఎల్‌ఏసీ వెళుతోందని చెబుతోంది. ఫింగర్‌-4 వద్ద భారత శిబిరం ఉంది. అయితే ఫింగర్‌-8 వరకూ మన బలగాలు గస్తీ నిర్వహించి వచ్చేవి. చైనా కూడా ఫింగర్‌-4 వరకూ గస్తీ నిర్వహించేది. మే నెలలో చైనా దళాలు ఫింగర్‌-4 వరకూ వచ్చి, అక్కడే తిష్ఠవేశాయి. చర్చల తర్వాత కూడా అక్కడి నుంచి డ్రాగన్‌ సేన పెద్దగా వెనక్కి మళ్లలేదు.

చైనా అధీనంలోని కీలక 'బ్లాక్‌ టాప్‌', 'హెల్మెట్‌' ప్రాంతాలు కూడా మన ఆయుధాల గురికి అందే అంత దూరంలోనే ఉన్నాయి. చైనా ట్యాంకులను దించడంతో మన సైన్యం టి-72, టి-90 ట్యాంకులను మోహరించింది. ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణుల (ఏటీజీఎం)నూ రంగంలోకి దించింది. సుశిక్షిత స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ను మోహరించింది.

పాంగాంగ్‌ త్సో పాక్షికంగా భారత్‌లోని లద్దాఖ్‌లో, కొంత మేర టిబెట్‌లో ఉంది. అందువల్ల దీని పేరు రెండు భాషల సమ్మిళితం. 'పాంగాంగ్‌' అంటే లద్దాఖీ భాషలో విస్తృత పుటాకారత్వమని అర్థం. 'త్సో' అంటే టిబెట్‌ భాషలో సరస్సు అని అర్థం. శీతాకాలంలో ఈ సరస్సు గడ్డకడుతుంది. ఫలితంగా దీనిపై కొంతమేర వాహనాల రాకపోకలకు వీలవుతుంది.

  • పాంగాంగ్‌ పొడవు 135 కిలోమీటర్లు
  • వెడల్పు 6 కిలోమీటర్లు
  • సముద్ర మట్టానికి 4270 మీటర్ల ఎత్తులో

ఇదీ చూడండి: చైనా ఆశలు రెండు గంటల్లోనే ఆవిరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.