ETV Bharat / bharat

జేబు దొంగలకు ఉరిశిక్ష వేస్తారా?: ఎంపీల సస్పెన్షన్​పై అధిర్​

మార్చి 2నుంచి 5వరకు లోక్​సభలో జరిగిన పరిణామాలను పరిశీలించేందుకు స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్​ ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్​ చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు భాజపా ఎంపీ ప్రేమ్​జీ భాయ్ సోలంకి. కాంగ్రెస్​ ఎంపీల సస్పెన్షన్... పిక్​పాకెటర్లకు ఉరిశిక్ష వేయాలనుకోవడంలా ఉందని ఆ పార్టీ నేత అధిర్​ రంజన్ చౌదరి అన్నారు.

loksabha news
పిక్​పాకెటర్ల​కు ఉరిశిక్ష విధిస్తారా? ఎంపీల సస్పెన్షన్​పై అధిర్​
author img

By

Published : Mar 6, 2020, 4:26 PM IST

Updated : Mar 6, 2020, 11:54 PM IST

జేబు దొంగలకు ఉరిశిక్ష వేస్తారా?: ఎంపీల సస్పెన్షన్​పై అధిర్​

పార్లమెంటు రెండో విడత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన మార్చి 2నుంచి 5వరకు సభలో జరిగిన పరిణామాలు సమీక్షించేందు స్పీకర్​ ఓం బిర్లా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఏడుగురు కాంగ్రెస్​ ఎంపీలపై సస్పెన్షన్​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు సభలో నిరసన చేపట్టిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు భాజపా ఎంపీ ప్రేమ్​జీ భాయ్​ సోలంకి.

తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదన్నారు కాంగ్రెస్ లోక్​సభా పక్షనేత అధిర్ రంజన్​ చౌదరి. పిక్​పాకెటర్లకు ఉరిశిక్ష విధించాలనుకోవడంలా ఈ నిర్ణయం ఉందని విమర్శించారు. సస్పెన్షన్​ను ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు.

పిక్​పాకెటర్లతో పోల్చడమేంటి...

కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్​ విషయంలో స్పీకర్​ది సరైన నిర్ణయమన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి. పిక్​పాకెటర్లతో ఎంపీలను పోల్చడమేంటని అధిర్​ను తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని, వాటితో తాము ఏకీభవించబోమని చెప్పారు.

భాజపా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ పార్టీ సభ్యులు ఏనాడు సభలో అగౌరవంగా వ్యవహరించలేదన్నారు జోషి.

సభలో అమర్యాదగా ప్రవర్తించినందుకు ఏడుగురు కాంగ్రెస్​ ఎంపీలు నిన్న సస్పెన్షన్​కు గురయ్యారు. కరోనా అంశంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీని ఉద్దేశించి ఆర్​ఎల్​పీ సభ్యుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీటిని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్​ సభ్యులు వెల్​ వద్దకు వెళ్లి బల్లపై ఉన్న కాగితాలను విసిరిపడేశారు. ఈ చర్యకు గాను సస్పెన్షన్​కు గురయ్యారు.

ఇదీ చూడండి: ప్రొఫైల్ చూసి ప్రేమించింది.. దివ్యాంగుడైనా పెళ్లాడింది

Last Updated : Mar 6, 2020, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.