శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డుతో ఆధార్ అనుసంధానం గడువు రేపటితో ముగుస్తుండగా... తాజాగా మరోసారి పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). వచ్చే ఏడాది(2020)మార్చి 31వరకు సమయమిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపింది.
"ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ కింద సబ్ సెక్షన్ 2 ప్రకారం పాన్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానించాల్సిన ఆధార్ గడువు తేది 2019 డిసెంబర్ 31వ నుంచి 2020 మార్చ్ 31వరకు పొడిగిస్తున్నాం."
-సీబీడీటీ ట్వీట్ .
ఈ అనుసంధాన ప్రక్రియ గడువు సమయాన్ని పొడిగించడం ఇది ఎనిమిదో సారి. రిటర్నులు దాఖలు చేసే వారికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలని గతేడాది ఏప్రిల్లో సుప్రీం ఆదేశించింది.
ఇదీ చూడండి : 'పౌర' సెగతో భారతీయ రైల్వేకు రూ.80కోట్లు నష్టం