ETV Bharat / bharat

'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ' - uttharpradesh

సాధారణంగా కాలనీల్లో నీటి సమస్య.. రోడ్ల సమస్య.. విద్యుత్తు సమస్య ఉండడం చూస్తూంటాం. ఈ వీధి వారికి  మాత్రం.. వారి కాలనీ పేరే సమస్య. అవును ఆ పేరు వల్లే వారిని భారతీయులుగా గుర్తించడంలేదు. ఆ పేరు వల్లే వారికి  ఏ సౌకర్యాలు త్వరగా అందడంలేదు. ఆ కథ ఏంటో చూద్దామా?

'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ.. మార్చండి'
author img

By

Published : Aug 3, 2019, 5:32 AM IST

'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ'
ఉత్తర్​ప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలోని 'పాకిస్థానీ వాలి గలీ' కాలనీ పేరు మార్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు స్థానికులు.
ఈ కాలనీలో సుమారు 70 ఇళ్లుంటాయి. వారందరూ భారతీయులే. కానీ ఆధార్​కార్డ్​ సహా అన్ని గుర్తింపు కార్డుల్లో వారి చిరునామాలు మాత్రం 'పాకిస్థానీ వాలి గలీ' అనే ఉంటుంది. ఎందుకంటే వారుంటున్న ఆ కాలనీ పేరు.. పాకిస్థాన్​ వారి వీధి.
దేశ విభజనకు ముందే పాకిస్థాన్​ నుంచి కొందరు వచ్చి ఈ ప్రదేశంలో స్థిరపడ్డారు. అందుకే ఈ ప్రదేశానికి పాకిస్థానీ వారి వీధిగా పేరొచ్చింది. కానీ, ఈ పేరు కారణంగా ఇక్కడ నివసిస్తున్న భారతీయులకు ఎన్నో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఆ పేరు చూడగానే తమను పాకిస్థాన్​ దేశస్థులుగా ఊహించుకుంటున్నారని వాపోతున్నారు స్థానికులు.

"మా అమ్మా నాన్న పాకిస్థానీలు కాదు.. మేమూ పాకిస్థానీలము కాదు. మా తాత ముత్తాతలెవరో నలుగురు పాకిస్థాన్​ నుంచి వచ్చారట. వారొచ్చినప్పుడు.. ఈ కాలనీ మొత్తం అడవిలా ఉండేది. మేము హిందుస్థాన్​కు చెందిన వారిమే. కానీ మా వీధి పాకిస్థానీ అయిపోయింది. ఈ కారణంగా ఎక్కడికెళ్లిన సమస్యలు తలెత్తుతున్నాయి."-సంధ్యావతీ, కాలనీ వాసి.

సొంత దేశంలోనే వారిని పరాయివారిగా చూడడం అక్కడివారికి అస్సలు సహించడంలేదు. ఈ కాలనీ పేరు వల్ల కనీస సౌకర్యాలు, ప్రభుత్వం కల్పించే సదుపాయాలు తమకు అందడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

"పిల్లలను ఇంత ఖర్చు పెట్టి చదివించినా లాభం ఉండడంలేదు. మా కాలనీ పేరు వల్ల ప్రయోజకులయ్యేందకు వీలులేకుండా పోయింది. ఆధార్​కార్డ్​లో ఈ చిరునామ ఉండడం వల్ల మాకు ఏ కార్యాలయంలోనూ పని త్వరగా అవ్వదు. అందుకే ప్రధాని మోదీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ కాలనీ పేరు మార్చమని కోరుతున్నాము."
-రూపేశ్, కాలనీ వాసి.

ఇదీ చూడండి:అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా పాక్ సైన్యం​ కుట్ర

Intro:Body:

g

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.