పాక్‌లో ఒక్కరోజులోనే 2,603 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 50వేలు దాటిందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి వల్ల మరో 50 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 1,067కు చేరింది. ఆయా రాష్ట్రాల్లోని లెక్కలను విడుదల చేసింది అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
ఏ రాష్ట్రంలో ఎన్ని?
రాష్ట్రం | కేసులు |
సింధ్ | 19,924 |
పంజాబ్ | 18,455 |
కైబర్-పఖ్తున్క్వా | 7,155 |
బలుచిస్థాన్ | 3,074 |
ఇస్లామాబాద్ | 1,326 |
పాక్ ఆక్రమిత కశ్మీర్ | 158 |
ప్రాణాంతక కరోనా నుంచి 15,201మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక విమానం ద్వారా దుబాయ్ నుంచి పాకిస్థాన్ వచ్చిన 251 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 4,45,987 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: భారత్‌పై చైనా కుట్రలను పసిగట్టిన అమెరికా!