ETV Bharat / bharat

370 రద్దును అడ్డుకునేందుకు కృషి: పాక్ - స్పందన

జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలకు అవకాశం కల్పించే ఆర్టికల్ 370, 35 ఏ రద్దు అంశమై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంలో తామూ భాగస్వాములమేనని, కశ్మీరీల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కశ్మీర్ అంశంలో మేమూ భాగస్వాములమే: పాక్
author img

By

Published : Aug 5, 2019, 3:36 PM IST

Updated : Aug 5, 2019, 4:17 PM IST

ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తి తొలగించడం పట్ల దాయాది పాకిస్థాన్ స్పందించింది. భారత ప్రభుత్వ నిర్ణయం అక్రమమని, ఏకపక్షమని, దీన్ని ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది.

"చట్టవ్యతిరేక చర్యలు చేపడుతున్న భారత్​ను నియంత్రించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం, సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటాం" అని వెల్లడించింది పాక్. కశ్మీరీల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నట్టు ఉద్ఘాటించింది.

కశ్మీర్ అంతర్జాతీయ అంశమని ప్రకటించిన పాక్ విదేశాంగ శాఖ... ఇందులో తాము కూడా ఒక భాగస్వామేనని చెప్పుకొచ్చింది. జమ్ముకశ్మీర్ అంశం అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న సరిహద్దు వివాదమని తెలిపింది.

ఈ అంశమై ఐరాస, ఇస్లామిక్ సహకార సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి. మిత్రదేశాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ అంశంపై మౌనంగా కూర్చోవని అభిప్రాయపడ్డారు.

"కశ్మీర్ వివాదాస్పద భూభాగమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పలు తీర్మానాలున్నాయి. వివాదాస్పద భూభాగమని ఐరాస అంగీకరించింది. భారత మాజీ ప్రధాని వాజ్​పేయీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు."

-షా మహ్మద్ ఖురేషి, పాక్ విదేశాంగ మంత్రి

కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు కొనసాగుతుందని, భారత నిర్ణయం సరికాదని కాలమే నిర్ణయిస్తుందని ఖురేషి వ్యాఖ్యానించారు.

మంగళవారం పాక్ పార్లమెంటు సమావేశం...

ఆర్టికల్ 370 రద్దు అంశం తెలుసుకున్న పాకిస్థాన్ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీ మంగళవారం ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశానికి పిలుపునిచ్చారు. మంగళవారం 11 గంటలకు పాక్ పార్లమెంట్ సమావేశం కానుంది. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి, భారత్ నిర్ణయంపై దేశ వైఖరిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చూడండి: ఏకపక్ష నిర్ణయంపై యుద్ధానికి సిద్ధం: అబ్దుల్లా

దేశంలో ఇక 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

'మోదీ మార్క్' సాహసం... ఆపరేషన్​ కశ్మీర్​

Intro:Body:

b

Conclusion:
Last Updated : Aug 5, 2019, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.