సరిహద్దు వెంట మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది దాయాది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా టాంఘర్ సెక్టార్లో భారత బలగాలే లక్ష్యంగా పాక్ సేనలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
భారత్‌లోకి చొరబాటుదారులను పంపడమే లక్ష్యంగా దాయాది ఈ కాల్పులు జరిపిందని తెలుస్తోంది. పాక్ దాడిలో ఓ ఇల్లు, రైస్‌మిల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 19 ఎద్దులు, గొర్రెలు ఉన్న రెండు షెడ్లు నేలమట్టమయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి.
పొరుగు దేశం దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్థాన్‌కూ తీవ్రస్థాయిలో నష్టం కలిగించినట్లు భారత సైన్యం ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన