జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో రగిలిపోతున్న పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. రాజౌరి జిల్లాలో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. సరిహద్దు వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్ ప్రయోగించింది.
నౌషేరా సెక్టార్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడిన ఘటనలో ఒక భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. పాక్ దాడుల్ని భారత్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.
ఇదీ చూడండి: మారని పాక్ వైఖరి.. 'కశ్మీర్'పై అవే బూటకపు వ్యాఖ్యలు