రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోకి శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించింది. దాదాపు 15 నిమిషాల పాటు చక్కర్లు కొడుతూ భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు భద్రతా సిబ్బంది పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన సైన్యం పాక్ డ్రోన్‌ను పేల్చేసింది.
దాయాది దేశం పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దేశ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అంతేకాకుండా ఆ దేశ నిఘా డ్రోన్లను భారత గగనతలంలోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. భారత సైన్యం అప్రమత్తత కారణంగా పాక్ పన్నాగాలేవి ఫలించడం లేదు.
ఇప్పటికే దేశ సరిహద్దుల్లో మార్చి 4 నుంచి మార్చి 10 లోపు ఆరు పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలకూల్చింది. అందులో మార్చి 10న ఒక్కరోజే మూడు పాకిస్థానీ డ్రోన్లు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. భారత సైన్యం వాటికి దీటుగా సమాధానమిచ్చింది.