ETV Bharat / bharat

'ఆహ్వానించకపోవటం పెద్ద అంశమేం కాదు'​

author img

By

Published : May 28, 2019, 1:38 PM IST

మే 30న జరిగే ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్​ పీఎం ఇమ్రాన్​ఖాన్​కు ఆహ్వానం పంపలేదు. భారత్ నిర్ణయం పెద్దగా పట్టించుకోవాల్సిందేం కాదని పాక్​ విదేశాంగ మంత్రి మహమ్మద్​ ఖురేషీ అభిప్రాయపడ్డారు.

'ఇమ్రాన్​ఖాన్​కు ఆహ్వానం లేదు': భారత్​

భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి... పాకిస్థాన్​ పీఎం ఇమ్రాన్​ఖాన్​ను ఆహ్వానించలేదు భారత్. అదేం అంత ప్రాధాన్యాంశం కాదని తేలిగ్గా కొట్టిపారేసింది

పాక్.

'బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్​ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్' (బిమ్స్​టెక్​)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్​, శ్రీలంక, థాయిలాండ్​, భూటాన్​, నేపాల్​ సభ్యదేశాలుగా ఉన్నాయి. దీనిలో పాకిస్థాన్​ సభ్యదేశం కాదు. అందుకే దాయాది దేశ ప్రధానికి ఆహ్వానం పంపకూడని భారత్​ నిర్ణయించింది.

కొట్టిపారేసిన పాక్..

భారత్​ నిర్ణయం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ అన్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేదానికన్నా.. కశ్మీర్​ సమస్య, సియాచిన్​, సర్​క్రీక్​ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే పాక్​ ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈ విషయంలో పాకిస్థాన్​ తనకు తానుగా ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించబోదని ఖురేషీ స్పష్టం చేశారు.

"భారత ప్రధాని మోదీ దృష్టి మొత్తం (భారత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ) పాకిస్థాన్​పై నిందలు వేయడంపైనే ఉంది. ఇప్పుడు తన మనస్సు మార్చుకుంటారని అనుకోవడం లేదు. భారత అంతర్గత రాజకీయాలు... పాక్​ ప్రధానిని ఆహ్వానించకుండా మోదీని అడ్డుకుంటున్నాయి. మోదీ ఈ ఉపఖండం అభివృద్ధి సాధించాలనుకుంటే.. అందుకు ఉన్న ఒకే పరిష్కారం పాకిస్థాన్​తో చర్చలు జరపడమే." - షా మహమ్మద్​ ఖురేషీ, పాక్​ విదేశాంగ మంత్రి

అప్పటికీ..ఇప్పటికీ...

2014 మే 26న జరిగిన మోదీ ప్రమాణస్వీకారానికి సార్క్​ దేశాల నేతలను ఆహ్వానించారు. అందులో భాగంగా అప్పటి పాక్ ప్రధాని నవాజ్​ షరీఫ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

గతేడాది పాక్ ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్​ఖాన్​కు మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. తాజాగా మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికైనందుకు ఇమ్రాన్​ఖాన్​ అభినందనలు తెలిపారు. ఇరుదేశాల అభివృద్ధికి, ఉపఖండంలో శాంతి స్థాపనకు కలిసి పనిచేద్దామని ఆకాంక్ష వెలిబుచ్చారు. అయినా ఇప్పుడు తన ప్రమాణస్వీకారోత్సవానికి ఇమ్రాన్​ఖాన్​ను మోదీ ఆహ్వానించకపోవడం గమనార్హం.

ఇదీ నేపథ్యం..

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్​ జవాన్లను 'జైషే మహమ్మద్​' ఉగ్రసంస్థ బలితీసుకుంది. దీనికి ప్రతిగా పాక్​ ఆక్రమిత కశ్మీర్​ బాలాకోట్​లోని ఉగ్రసంస్థ స్థావరాలపై భారత్​ వైమానిక దళం మెరుపుదాడి చేసి ధ్వంసం చేసింది. ప్రతిగా పాక్ భారత భూభాగంపై దాడికి పాల్పడింది. దీనిని భారత్​ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటునే ఉన్నాయి.

ఇదీ చూడండి: 'రాహుల్​ రాజీనామా'పై కాంగ్రెస్​ తర్జనభర్జన

Intro:Body:

gh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.