ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయాన్ని బుధవారం నుంచి భక్తుల సందర్శన కోసం తెరవనున్నారు. కొవిడ్-19 కారణంగా మార్చి 21 నుంచి ఆలయ సందర్శనను నిలిపివేశారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకునేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో ఆలయ వెబ్‌సైట్ www.spst.in లో బుక్ చేసుకోవాలని సూచించారు. రోజులో గరిష్ఠంగా 665 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.