ETV Bharat / bharat

'బిహార్​లో మహాకూటమి ఓటమికి ఓవైసీనే కారణం'

బిహార్​లో మహాకూటమి ఓటమికి అసదుద్దీన్​ ఓవైసీనే కారణమని ఆరోపించారు ఆ రాష్ట్ర ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్​ సింగ్. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఏఐఎంఐఎం ఓట్లు చీల్చడం వల్లే కూటమి విజయావకాశాలు దెబ్బతిన్నాయని చెప్పారు.

Owaisi s party spoiled the chances of 3 seats of Grand Alliance, two of JDU and 16 of RJD
'బిహార్​లో మహాకూటమి ఓటమికి ఒవైసీనే కారణం'
author img

By

Published : Nov 16, 2020, 6:23 PM IST

ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ వల్లే బిహార్​లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్​ సింగ్​. ఒవైసీ సారథ్యంలోని పార్టీ కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్లను చీల్చి మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ఫలితంగా ఎన్డీఏకు మేలు చేశారని చెప్పారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఏఐఎంఐఎం బిహార్​లో గెలిచిన ఐదు స్థానాల్లో గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్​ గెలిచాయని పేర్కొన్నారు.

బిహార్ అసెంబ్లీ​ ఎన్నికల్లో పోటీ చేసి ఎవరూ ఊహించని విధంగా ఐదు స్థానాలు కైవసం చేసుకుంది అసదుద్దీన్​ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం. ఆ రాష్ట్రంలో గతంలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం. ఆర్​ఎల్​ఎస్పీ, బీఎస్పీ సహా ఇతర చిన్న పార్టీలను కలుపుకొని గ్రాండ్​ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్​ను ఏర్పాటు చేసిన ఏఐఎంఐఎం.. 22స్థానాల్లో బరిలోకి దిగి ఆశించిన ఫలితాలు సాధించింది. ఫలితంగా కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది.

ఏఐఎంఐఎం గెలిచిన కోచాదామన్​​, జోకిహత్​, బైసీ, బహదుర్​గంజ్​, అమౌర్​ స్థానాల్లో గతంలో ఎప్పుడూ కాంగ్రెస్​, ఆర్జేడీకి అనుకూలంగా విజయావకాశాలు ఉండేవి. పలుమార్లు జేడీయూ కూడా ఇక్కడ గెలిచింది. కానీ ఈసారి అందరికీ షాక్ ఇస్తూ ఎంఐఎం విజయ ఢంకా మోగించింది. ఇతర స్థానాల్లోనూ ముస్లిం, దళితుల ఓట్లను చీల్చి ఆర్జేడీ, కాంగ్రెస్​ను దెబ్బతీసింది.

ఓవైసీ స్పందన..

బిహార్​లో మహాకూటమి ఓటమికి తాను కారణమని ఆరోపించడం సరికాదన్నారు ఓవైసీ. ఎన్నికలకు ముందే నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని తాను చెబితే ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. ఆర్జేడీ విధాన వైఫల్యమే ఎన్డీఏ విజయానికి అసలు కారణమన్నారు.

ఇదీ చూడండి: బిహార్​లో ఘనంగా నితీశ్ ప్రమాణ స్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.