గత మూడేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన కోసం అయిన విమాన ఛార్జీల ఖర్చు రూ.255 కోట్లు అని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
మోదీ విదేశీ పర్యటనలకు అయిన విమాన ప్రయాణ ఖర్చుల వివరాలను విదేశాంగశాఖ సహాయమంత్రి వీ. మురళీధరన్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించారు. మోదీ విమానప్రయాణాల ఖర్చు 2016-17లో రూ.76.27 కోట్లు, 2017-18లో రూ.99.32 కోట్లు, 2018-19లో రూ.79.91 కోట్లు ఖర్చు అయ్యిందని ఆయన వెల్లడించారు.
2019-20 సంవత్సరానికి అయిన విమానఖర్చుల బిల్లు ఇంకా రాలేదని మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు.
ఇదీ చూడండి: తెలుగు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: లోకేశ్