ETV Bharat / bharat

రైళ్లలో 73 వేల మంది ట్రాన్స్​జెండర్స్​ అరెస్ట్ - అరెస్టు

రైల్వే ప్రయాణికులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్​జెండర్లను గత నాలుగేళ్లలో 73 వేల మందిని అరెస్టు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది.

రైళ్లలో 73 వేల మంది ట్రాన్స్​జెండర్స్​ అరెస్ట్
author img

By

Published : Apr 25, 2019, 5:47 PM IST

గత నాలుగేళ్లలో రైల్వే ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు దండుకుంటున్న 73 వేల మందికిపైగా ట్రాన్స్​జెండర్లను అరెస్టు చేశామని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. రోజుకు సుమారు 50 మందిని ఇలా అదుపులోకి తీసుకుంటున్నట్లు ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

2015లో 13 వేల 546 మంది, 2016లో 18 వేల 526 మంది, 2017లో 20 వేల 566 మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2019 జనవరిలో 1,399 మంది ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేశారు.

రైల్వే భద్రతా దళం (ఆర్​పీఎఫ్​) తరచూ తనిఖీలు చేస్తుంటుంది. అయినా ప్రయాణికులను బెదిరించి ట్రాన్స్​జెండర్లు డబ్బులు వసూలు చేసినట్లు రైల్వేశాఖకు పలు ఫిర్యాదులు అందతున్నాయి. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన సందర్భాల్లో ప్రయాణికులు వేధింపులకు, భౌతిక దాడులకు గురైన ఘటనలూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: టార్గెట్​ అమెరికా: కిమ్​, పుతిన్​ స్నేహగీతం

Rajouri (J and K), Apr 25, (ANI): Snow clearing operation on Mughal road is underway in Jammu and Kashmir's Rajouri. The traffic movement is paused till the time snow is being cleared.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.