ETV Bharat / bharat

కొద్ది నిమిషాల్లోనే 45,533 రైలు టికెట్లు బుక్​ - ప్రత్యేక రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే

భారతీయ రైల్వే నడపనున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు దాదాపు 80 వేల మంది ప్రయాణికులు రూ.16.05 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ రైళ్ల సేవలు నేటి సాయంత్రం ప్రారంభం కానున్నాయి.

Over 45,000 bookings worth Rs 16 crore so far for special trains: Railways
రూ.16.15 కోట్ల విలువైన రైల్వే టికెట్ల బుకింగ్​
author img

By

Published : May 12, 2020, 12:42 PM IST

ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది ప్రయాణికులు రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. మొదటి ప్రత్యేక రైలు కొత్త దిల్లీ స్టేషన్​ నుంచి మధ్యప్రదేశ్​లోని బిలాస్​పుర్​కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది.

ఈ ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. రానున్న ఏడు రోజులకు ఇప్పటి వరకు రూ.16.15 కోట్ల విలువైన 45,533 బుకింగ్​లు (పీఎన్​ఆర్​లు) అయ్యాయి. ఫలితంగా 82,317 మంది తమ స్వస్థలాలకు చేరుకోనున్నారు.

ప్రత్యేక మార్గదర్శకాలు

యాభై రోజుల విరామం తర్వాత రెగ్యులర్‌ ప్రయాణికుల రైళ్లు (15 ప్రత్యేక రైళ్లు) మంగళవారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. ఈ రైళ్ల ప్రయాణానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని రైల్వేశాఖ ప్రకటించింది.

రైలు ప్రయాణికులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం 90 నిమిషాలు ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఆహారం, మంచినీరు వెంట తెచ్చుకోవాలి. ప్రయాణికులు తమ మొబైల్​లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలి.

నేటి నుంచి..

రైల్వే మంగళవారం ఎనిమిది రైళ్లను నడుపుతుంది. న్యూదిల్లీ నుంచి దిబ్రూగర్హ్, ముంబయి, బిలాస్​పుర్​కు​ మూడు రైళ్లు వెళతాయి. హౌవ్​డా, రాజేంద్రనగర్​ (పట్నా), బెంగళూరు, ముంబయి సెంట్రల్​, అహ్మదాబాద్​ నుంచి దిల్లీకి ఐదు రైళ్లు వస్తాయి.

ధ్రువీకరణ ఉంటేనే...

ఈ ప్రత్యేక రైళ్లలో ఎయిర్ కండిషన్డ్​ కోచ్​లు మాత్రమే ఉంటాయి. కరోనా సంక్షోభం సమయంలో ఈ రైళ్లను నడుపుతున్నందు వల్ల ధ్రువీకరించబడిన ఈ-టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఈ స్టేషన్లలోకి అనుమతిస్తారు. ఈ రైళ్ల ఛార్జీలు రాజధాని రైళ్ల ఛార్జీలకు సమానంగా ఉంటాయి. ప్రయాణికులు ఏడు రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఆర్​ఏసీ, వెయిటింగ్ లిస్ట్, ఆన్​బోర్డ్ బుకింగ్​లను అనుమతించరు.

ఇదీ చూడండి: ముందు చూస్తే కరోనా.. వెనుక చూస్తే క్యాన్సర్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.