ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది కాలంగా స్వీకరించిన బహుమతుల ప్రదర్శన, వేలం ప్రక్రియలను కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. బహుమతుల వేలం ద్వారా వచ్చిన నిధులను 'నమామి గంగే ప్రాజెక్టు' పనులకు వినియోగించనున్నారు. ఈ వేలంలో ప్రజలు పాల్గొనాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
వేలంలో మీరూ పాల్గొనవచ్చు
మోదీకి బహుమతులుగా వచ్చిన జ్ఞాపికలు, శాలువాలు, తలపాగాలు, జాకెట్లు సహా 2,700 బహుమతులను ఈ దఫా వేలం వేస్తున్నారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. నేటి నుంచి అక్టోబర్ 3 వరకు www.pmmementos.gov.in వెబ్సైట్ ద్వారా ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఈ బహుమతుల కనీస ధర రూ.200 నుంచి గరిష్ఠంగా రెండున్నర లక్షల రూపాయలుగా నిర్ణయించారు.
జనవరిలో ప్రధాని మోదీ అందుకున్న బహుమతులను ఒకసారి వేలం వేశారు.
ప్రదర్శన
దిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎమ్ఏ)లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మోదీ జ్ఞాపికల ప్రదర్శన జరుగుతుంది. ఇందులో మోదీకి వచ్చిన 500 జ్ఞాపికలు, దుస్తులు, చిత్రాలు, శిల్పాలను 'స్మృతి చిహ్న్' పేరుతో ప్రదర్శిస్తారు. ప్రదర్శనలో ప్రతివారం వస్తువులను మారుస్తారు.
ఇదీ చూడండి: ఆన్లైన్కొస్తే ప్రేమ పుట్టింది.. ఇంటికొస్తే పెళ్లైపోయింది!