ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తొలి విడతలో 2.69 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరలేదు. బ్యాంకు ఖాతాల్లో పొరపాట్ల కారణంగానే ఇలా జరిగిందని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రుపాలా. ఈ పొరపాట్లను సరిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు తెలిపారు.
సరైన భూ రికార్డులు లేని కారణంగా మణిపూర్, నాగాలాండ్, ఝార్ఖండ్‌లలో పథకం అమలులో సమస్యలు ఉన్నట్లు తెలిపారు రుపాలా. త్వరలోనే ఈ అడ్డంకులు తొలగుతాయని చెప్పారు.
ప్రధాన మంత్రి కిసాన్ పథకం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కేంద్రం ప్రారంభించింది. ఏటా 3 వాయిదాల్లో రూ.6 వేలను పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది కేంద్రం.
ఇదీ చూడండి: మానవ హక్కుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం