ETV Bharat / bharat

'వందే భారత్​ మిషన్ ద్వారా లక్ష మంది స్వదేశానికి రాక' - Vande Bharat mission updates

'వందే భారత్​ మిషన్​'లో భాగంగా ఇప్పటివరకు 1.07లక్షల మందికి పైగా స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. రెండో దశను జూన్​ 13వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. మూడో దశ మిషన్​కు సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొంది.

Over 1.07 lakh Indians returned to India after launch of Vande Bharat mission: MEA
'వందే భారత్​ మిషన్ ద్వారా లక్ష మందికి పైగా స్వదేశానికి రాక'
author img

By

Published : Jun 4, 2020, 10:08 PM IST

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఏర్పాటు చేసిన 'వందే భారత్​ మిషన్​' ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 1.07లక్షల మందికి పైగా భారత్​కు తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. జూన్​ 13న రెండో దశ తరలింపు పూర్తయిన తర్వాత మూడో దశ మిషన్​ కోసం ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

"మూడో దశలో 337 విమాన సర్వీసుల ద్వారా 31దేశాల నుంచి సుమారు 38,000మందిని స్వదేశానికి తీసుకురావాలని భావిస్తున్నాం."

-అనురాగ్​ శ్రీవాస్తవ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి

జూన్​ 13 వరకు రెండో దశ

మే 7 నుంచి మే 15 వరకు తొలిదశలో 12దేశాల నుంచి 15,000మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు శ్రీవాస్తవ తెలిపారు. అనంతరం మే 17 నుంచి మే 22 వరకు రెండో దశగా నిర్ణయించారు. అయితే దీనిని జూన్​ 13 వరకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దశలో 103 విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. శ్రీలంక, మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను... భారతీయ నౌకల ద్వారా స్వదేశానికి తరలిస్తున్నామని చెప్పారు.

లక్ష మందికి పైగా

'వందే భారత్​ మిషన్​లో భాగంగా మే 7 నుంచి ఇప్పటివరకు 454 విమానాల ద్వారా 1,07,123 మందిని స్వదేశానికి తరలించాం. వారిలో 17,485మంది వలసకార్మికులు, 11,511మంది విద్యార్థులు, 8,633మంది వృత్తినిపుణులు ఉన్నారు'

- శ్రీవాస్తవ

భారత్​ సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్​, నేపాల్​, భూటన్​ల నుంచి 32,000 మంది భారతీయలను రహదారి మార్గం గుండా వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 3,48,565 మంది తమను స్వదేశానికి తీసుకురావాలని అభ్యర్థించినట్టు వెల్లడించింది.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.