ETV Bharat / bharat

రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు - రాజ్యసభ అప్​డేట్స్

ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్​ను వెంటనే ఎత్తివేయాలని రాజ్యసభలో కాంగ్రెస్​ డిమాండ్ చేసింది. అప్పటివరకు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్​ వెంట విపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచి సభ నుంచి వాకౌట్ చేశాయి.

Opposition to boycott Rajya Sabha till suspension of 8 members revoked:Azad
రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్
author img

By

Published : Sep 22, 2020, 11:32 AM IST

Updated : Sep 22, 2020, 11:51 AM IST

రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్​ సహా విపక్ష పార్టీలైన ఆమ్​ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, వామ పక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేసేంతవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ప్రకటించారు.

  • ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు.. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయనీయకుండా మరో బిల్లును తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
  • స్వామినాథన్‌ సిద్ధాంతాన్ని అనుసరించి కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని కోరారు.
  • 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

గత రెండు రోజులుగా సభలో జరిగిన పరిణామాల పట్ల ఎవరూ సంతోషంగా లేరని నేను భావిస్తున్నాను. కోట్ల మంది ప్రజలకు ప్రాతినిథ్యం వహించేవారిని ప్రజలు చూస్తారు. వారి గళాన్ని వినిపించాలని కోరుకుంటారు. అధికార సభ్యులైనా, ప్రతిపక్ష సభ్యులైనా సభకు ఎందుకు వచ్చారో ఆ లక్ష్యం పూర్తి కావాలి. ఈ లక్ష్యం రెండు, మూడు నిమిషాల్లో పూర్తి కాదు.

- గులాంనబీ ఆజాద్‌, రాజ్యసభలో ప్రతిపక్ష నేత

ఈ మూడు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు గులాం నబీ ఆజాద్‌ తెలిపారు.

మొదటగా కాంగ్రెస్ సహా ఆప్​, టీఎమ్​సీ, వామ పక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. కాసేపటికే ఎన్​సీపీ, ఎస్పీ, శివసేన, ఆర్​జేడీ వీరికి మద్దతుగా సభ నుంచి బయటకు వచ్చేశాయి.

పునరాలోచన అవసరం..

కాంగ్రెస్​ చేసిన డిమాండ్లను వెంకయ్య తోసిపుచ్చారు. సమావేశాలను బహిష్కరించడం తగదన్నారు.

"ఎంపీలను సస్పెండ్​ చేయడంపై నేను ఆనందంగా లేను. అయితే వారి ప్రవర్తన కారణంగా చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఏ ఒక్క వ్యక్తికి మేం వ్యతిరేకం కాదు. ప్రతిపక్షం.. మరోసారి పునరాలోచించుకొని సమావేశాల్లో పాల్గొనాలి."

- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్

Last Updated : Sep 22, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.