వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 8 పార్లమెంటరీ స్థాయిసంఘాల ఏర్పాటుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోద ముద్ర వేశారు. అధికార భాజపా మూడు కమిటీలకు నేతృత్వం వహించనుంది. విపక్షాలు ఐదు కమిటీలకు నేతృత్వం వహిస్తాయి.
హోం మంత్రిత్వ వ్యవహారాల స్థాయిసంఘం ఛైర్మన్గా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ వ్యవహరిస్తారు. శాస్త్రవిజ్ఞాన, సాంకేతిక, పర్యావరణ, అటవీ శాఖ స్టాండింగ్ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ నేతృత్వం వహించనున్నారు.
మానవ వనరుల అభివృద్ధి, వ్యక్తిగత ప్రజా వ్యవహారాలు, న్యాయశాఖ స్థాయిసంఘాలకు అధికార భాజపా నేతలు ఛైర్మన్లుగా ఉంటారు.
లోక్సభ, రాజ్యసభ నుంచి మొత్తం 24 స్థాయిసంఘాలుంటాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించిన 16 స్టాండింగ్ కమిటీలకు కూడా ఎగువ సభలో అంగీకారం తెలిపారు వెంకయ్య.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్ విచ్ఛిన్నం తప్పదు'