ETV Bharat / bharat

ప్రతిపక్షాలకు ఓటమి తప్పదు: నరేంద్ర మోదీ - BJP

ప్రతిపక్షాలకు ఓటమి తప్పదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. ప్రజలు సమర్థమైన ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఉత్తర్​ప్రదేశ్ కుషీనగర్​లో చివరి దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ.

ప్రతిపక్షాలకు ఓటమి తప్పదు: నరేంద్ర మోదీ
author img

By

Published : May 12, 2019, 2:06 PM IST

ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యే సరికి ప్రతిపక్షాల ఓటమి ఖరారైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను వారి ఇంట్లోకి చొరబడి మట్టుబెట్టగల సమర్థనీయ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారంటూ భాజపా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ కుషీనగర్​లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు ప్రధాని. మహాకూటమి పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజస్థాన్​లో ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే మాయావతి మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు.

సభలో మాట్లాడుతున్న మోదీ

" ఐదు దశల పోలింగ్​ పూర్తయింది. ప్రతిపక్షాలు నలు మూలలా ఓడాయి. చౌకీదార్​పై ప్రజలకు ఇంత ప్రేమ ఎందుకని వాళ్లకు అర్థం కావడం లేదు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్​ పార్టీలు ఎలా పనిచేస్తాయో రాజస్థాన్​లో వారి పాలన రుజువు చేస్తుంది. ఆ రాష్ట్రంలో ఒక ఎస్సీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతోంది. మాయావతి ఇంకా ఎందుకు మద్దతు ఉపసంహరించుకోలేదు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: ఆస్పత్రిలో ఏసీ పనిచేయక లాలూ ఇక్కట్లు

New Delhi, May 12 (ANI): Delhi Chief Minister Arvind Kejriwal cast his vote at a polling booth in Civil Lines. Voting for the all seven Lok Sabha constituencies is underway. Last phase of elections will be held on May 19 and counting will take place on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.