ETV Bharat / bharat

మోదీ 2.0: నవ భారత నిర్మాణమే లక్ష్యంగా నిర్ణయాలు

2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన నరేంద్ర మోదీ సర్కారు శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడాది కాలంలో భారతావనిపై చెరగని ముద్ర వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాల్ని తీసుకుంది. నవ భారత నిర్మాణమే లక్ష్యమంటూ మోదీ ప్రభుత్వం సాగించిన  ఏడాది పాలనలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను తెలుసుకుందాం.

Modi 2.0
మోదీ 2.0: నవ భారత నిర్మాణమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు
author img

By

Published : May 30, 2020, 12:05 PM IST

నవ భారత నిర్మాణమే లక్ష్యమంటూ మోదీ ప్రభుత్వం సాగించిన ఏడాది పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు ఉన్నాయి. మొదటి 100 రోజుల్లోనే సాహసోపేత చర్యలకు శ్రీకారం చుట్టింది. చివరిన కరోనా మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక వ్యవస్థకు కలిగించిన నష్టం నుంచి గట్టెంకేందుకు ఆత్మ నిర్భర్​ అభియాన్​ పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. నిరుపేదలకు గూడు, వ్యవసాయానికి భరోసా, పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు సహా కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఆర్థిక నిబ్బరానికి 'ఆత్మ నిర్భర్‌'

కరోనా మహమ్మారి రేపుతున్న కల్లోలం నుంచి అన్ని రంగాలను కాపాడటానికి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.20 లక్షల కోట్ల 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' ప్యాకేజీ దేశ ఆర్థికవ్యవస్థకు సాంత్వనగా నిలిచింది. భారత ఆర్థిక వ్యవస్థను 2024 చివరికి 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న భారీ లక్ష్యసాధనకు నిర్ణయాలు ఓవైపు కొనసాగుతుండగానే.. కమ్ముకొచ్చిన కరోనా మహమ్మారి తాకిడిని తట్టుకునేలా అనేక ఉపశమనాలతో ఈ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.

ఉపాధికి హామీ

స్వస్థలాలకు తిరిగొస్తున్న పేదల కోసం ఉపాధి హామీ నిధుల పెంపు. కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన రూ.60 వేల కోట్లకు అదనంగా మరో రూ.40 వేల కోట్లు కలిపారు. రోజువారీ కూలీ రూ.202కి పెంపుదల.

ప్రజలకు గూడు

పేదలకు చౌకగా అద్దె ఇళ్ల పథకంతో నగరాల మురికివాడల ప్రజలకు మెరుగైన ఆవాసం. రూ.6-18 లక్షల వార్షికాదాయ తరగతులవారు తీసుకొనే ఇళ్ల రుణాలపైనా అదనపు వడ్డీ రాయితీతో వారికి ఊరట.

వ్యవ'సాయం'

రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంగా మత్స్యకారులు, పశుపోషకులు సహా 2.5 కోట్ల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.2 లక్షల కోట్ల రాయితీ రుణాలు. ఆహారశుద్ధికి ఊతమిస్తూ మైక్రోఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ క్రమబద్ధీకరణకు రూ.10 వేల కోట్లతో పథకం. లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతుల నుంచి రూ.74,300 కోట్ల పంట ఉత్పత్తుల సేకరణ. ఎగుమతుల పెంపు, గిట్టుబాటు ధరలు లక్ష్యంగా చిరుధాన్యాలు, వంటనూనెలు, నూనెగింజలు, ఉల్లి, ఆలుగడ్డల నిల్వల పరిమితులపై నియంత్రణల ఎత్తివేతకు నిర్ణయం. రైతులు తమ పంట ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకునేలా ప్రభుత్వం కేంద్రీకృత చట్టం తేనుంది.

ప్రైవేటుకు పెద్దపీట

అధిక వృద్ధిరేటు సాధన, భారీ పెట్టుబడుల ఆకర్షణకు గాను బొగ్గు గనులను రెవెన్యూ షేరింగ్‌ విధానంలో ప్రైవేటుకు అప్పగింత. వివిధ ఖనిజాలను ఏ అవసరానికైనా ఉపయోగించుకొనేలా బహిరంగ వేలం విధానానికి శ్రీకారం. వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు కీలక నిర్ణయం. నిర్వహణ వ్యయం తగ్గడానికి, పనితీరు మెరుగవ్వడానికి ప్రభుత్వరంగ సంస్థలను 1-4 వరకు మాత్రమే పరిమితం చేయాలన్నది యోచన. ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)కు చెందిన 18 విమానాశ్రయాలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడానికి నిర్ణయం. ప్రస్తుతం 60% వరకే అందుబాటులో ఉన్న భారతీయ గగనతలాన్ని మరింత విస్తరించే యోచన. యువతకు ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంతో.. భారత్‌ను విమానాల మరమ్మతు, ఓవర్‌ హాలింగ్‌ కేంద్రంగా మార్చడానికి చర్యలు.

వివాద్‌ సే విశ్వాస్‌

2018-19 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తిగత ఆదాయపన్ను మదింపులో తేడాలపై 2019 నవంబరు 30 వరకు రూ.9.32 లక్షల కోట్లకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలన్నదే లక్ష్యం. 90% వివాదాలు పరిష్కారమైనా కనీసం రూ.4.83 లక్షల కోట్ల రాబడి వస్తుందని అంచనా. వివాదాస్పద పన్ను మొత్తాన్ని చెల్లించిన వారికి వడ్డీ, జరిమానా రద్దుచేస్తారు. కరోనా కారణంగా పథకం గడువును డిసెంబరు 31 వరకు పొడిగించారు.

బ్యాంకుల విలీనం

దేశంలోని 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తూ 4 పెద్ద బ్యాంకులుగా ప్రభుత్వం మార్చింది. కరోనా కష్టకాలంలోనూ ఈ ప్రక్రియను పూర్తిచేసింది. 1 - ఇండియన్‌ బ్యాంకులోకి అలాహాబాద్‌ బ్యాంకు.. 2 - పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోకి ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. 3 - సిండికేట్‌ బ్యాంకులోకి కెనరా బ్యాంకు.. 4 - యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోకి ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులు విలీనం చేశారు.
లక్ష్యాలు: ఆర్థిక కార్యకలాపాలపై నిఘా, నియంత్రణ పెంపు; అవకతవకల నియంత్రణ; ఒక్కో బ్యాంకు రూ.8 లక్షల కోట్ల కంటే అధిక సామర్థ్యంతో.. ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకులతో పోటీ పడటం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.