ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలోని బిరాభట్టి గ్రామంలో భద్రతాదళాలు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గ్రామంలో రిజర్వ్ గార్డ్ బృందం తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిఘటించిన భద్రతా దళం వారిపై ఎదురుకాల్పులు జరిపింది.
ఆ ఘటనలో ఒక నక్సలైట్ మృతిచెందాడు. ఘటనాస్థలం నుంచి భద్రతా దళాలు మృతదేహంతో పాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. మృతుడు మావోయిస్టుల పార్టీ కమిటీ కార్యదర్శి మడ్కమ్ హిద్మాగా గుర్తించారు. ఇతనిపై లక్ష రూపాయల రివార్డు ఉంది.
ఇదీ చూడండి:- కశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వానికి సిద్ధం: ట్రంప్