ఆయన పేరు శ్యాం శరణ్ నేగి. ఉండేది హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా కల్పా పట్టణంలో. మాజీ ఉపాధ్యాయుడైన శ్యాం ప్రస్తుత వయసు 102 ఏళ్లు. అయినా ఓటేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉత్సాహంగా చెబుతున్నారు. 1951 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారి ఓటు వేశారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు జరిగే సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్‌లోనూ ఓటు వేయనున్నారు.
కేంద్రానికి తీసుకెళతాం
102 ఏళ్ల శ్యాం శరణ్ నేగి ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు కిన్నౌర్ జిల్లా కలెక్టర్. ఆయనను గౌరవంగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదీ చూడండి- WC 19: 1999 ప్రపంచకప్- విశ్వవిజేతగా మరోసారి ఆసీస్