తమిళనాడులో జరుగుతున్న పురాతత్వ శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఓ పురాతన బావి బయటపడింది. శివగంగై జిల్లా మధురై సమీపంలోని కీళాదిలో జరుగుతున్న ఐదో దఫా తవ్వకాల్లో 4 అడుగుల ఇటుక బావిని కనుగొంది పురావస్తు శాఖ.
నాలుగు పొరలు ఉన్న ఈ పురాతన కట్టడం.. ఈ నెలలోనే బయటపడిన మరో బావిని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కీళాదిలో అయిదో దశ తవ్వకాలు జూన్ 13న ప్రారంభించారు. ఈ తవ్వకాల్లో ఇప్పటివరకు వేలకొద్ది వస్తువులు బయటపడ్డాయి. తమిళనాడు భాష, సాంస్కృతిక, పురాతత్వ శాఖ మంత్రి కె.పాండియ రాజన్ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి: 75 ఏళ్లు పైబడిన వారికి భోజనం ఉచితం