ETV Bharat / bharat

'వలస కూలీల కోసం 50 వేల అద్దె ఇళ్ల నిర్మాణం'

వలస కూలీల కోసం 50 వేల అద్దె ఇళ్లు నిర్మించాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ చమురు​ సంస్థలను కోరింది.

author img

By

Published : Oct 11, 2020, 5:24 PM IST

oil ministry_migrants
'వలస కూలీల కోసం 50 వేల అద్దె ఇళ్ల ఏర్పాటు'

వలస కూలీల కోసం దేశవ్యాప్తంగా 50 వేల అద్దె ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కోరింది పెట్రోలియం శాఖ. లాక్​డౌన్​లో లక్షలాది మంది శ్రమజీవులు నగరాలు వదిలి స్వగ్రామాలకు తరలివెళ్లిన నేపథ్యంలో... వారికి చౌకగా అద్దె ఇళ్లు ఇప్పించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేసింది.

వలస కూలీల కోసం ఇళ్ల నిర్మాణంపై ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​, హిందుస్థాన్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్​పీసీఎల్), భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్(బీపీసీఎల్), జీఏఐఎల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్​జీసీ) సంస్థల ప్రతినిధులతో ఇటీవలే సమావేశం నిర్వహించింది చమురు శాఖ. గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఇళ్ల నిర్మాణ పథకం ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించింది.

కొన్ని సంస్థల విముఖత!

కేంద్రం ప్రతిపాదన నేపథ్యంలో ఇప్పటికే ఇళ్ల స్థలాల వెతుకులాట ప్రారంభించాయి కొన్ని సంస్థలు. అయితే మరికొన్ని సంస్థలు మాత్రం అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఖాళీ స్థలాలు అందుబాటులో లేవని చెప్పాయి.

ఇదీ చదవండి:అద్దె ఇంటినే లీజుకు ఇచ్చాడు.. యజమాని షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.