కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ఒడిశాకు కాస్త ఉపశమనం కలిగింది. గడిచిన 72 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. గత మూడు రోజుల్లో 1,042 శాంపిల్స్‌ను పరీక్షించగా వీరందరికీ కరోనా నెగటివ్‌గా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
భువనేశ్వర్‌లో మరో ఇద్దరు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 21కి పెరిగింది. ఒడిశాలో ప్రస్తుతం 38 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరందరూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.