దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కొవిడ్.. రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 19,218 మందికి వైరస్ సోకింది. మరో 378 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షల 63వేలు దాటగా... 25,964 మంది మరణించారు.
కర్ణాటకలో కొత్తగా 9 వేల 280 మంది వైరస్ బారినపడ్డారు. మరో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,79,486కు చేరగా.. మృతుల సంఖ్య 6,170కి పెరిగింది.
తమిళనాడులో రోజూ స్థిరంగా 6 వేల కేసులు బయటపడుతున్నాయి. తాజాగా 5,976 మంది కరోనా బారినపడగా... 6,334 మంది రికవరీ అయ్యారు. మరో 79 మంది చనిపోయారు. ఇప్పటివరకు 3 లక్షల 92 వేల మందికి వైరస్ నయమైంది. మరో 51,633 మంది చికిత్స పొందుతున్నారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 3,762 మంది వైరస్ బారినపడ్డారు. మరో 71 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 53 వేలు దాటింది.
- ఒడిశాలో కొత్తగా 3,267 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,16,678కి చేరింది. 531 మంది మహమ్మారికి బలయ్యారు.
- దిల్లీలో తాజాగా 2,914 కరోనా కేసులు వెలుగుచూశాయి. గడచిన 69 రోజుల్లో ఇవే అత్యధిక కేసులని అధికారులు తెలిపారు. వీరితో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1.85 లక్షలకు చేరింది. ఫలితంగా 4,513 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కేరళలో మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా 2,479 మందికి వైరస్ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా 18,800 యాక్టివ్ కేసులు ఉండగా... 58,498 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- గుజరాత్లో మరో 1,320 మందికి కరోనా సోకగా.. 14 మంది మృతి చెందారు.
- జమ్ముకశ్మీర్‌లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,047 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 755 మంది మృతి చెందారు.