ETV Bharat / bharat

ఒడిశా పీఠం మళ్లీ పట్నాయక్​దే..! - భాజపా

ఒడిశాలో మరోమారు బీజేడీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.

ఒడిశా పీఠం మళ్లీ పట్నాయక్​దే..!
author img

By

Published : May 23, 2019, 12:11 PM IST

లోక్​సభ ఎన్నికలతో పాటు ఒడిశా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజూ జనతా దళ్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఐదో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు నవీన్ పట్నాయక్. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న భాజపా రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయింది.

ఒడిశాలో 19 ఏళ్లుగా బిజూ జనతాదళ్​దే ఏకచ్ఛత్రాధిపత్యం. తొలిసారి 2000 సంవత్సరంలో పాలన పగ్గాలు చేపట్టారు నవీన్​ పట్నాయక్. ఆ తర్వాత తిరుగులేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ గెలిచారు.

సవాళ్ల సవారీ....

ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలు రచించారు పట్నాయక్. జనాకర్షక మంత్రంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో 33శాతం టికెట్లను మహిళలకే కేటాయిస్తామన్న ప్రకటనతో ఆ వర్గం ఓట్లపై గురిపెట్టి విజయం సాధించారు.

ఫలించని భాజపా వ్యూహాలు...

ఒడిశాలో పాగా వేయడంపై భాజపా ఎప్పటినుంచో కసరత్తు చేసింది. అధికార పార్టీకి చెందిన కీలక నేతల్ని తమవైపునకు తిప్పుకుంది. వీలు చిక్కినప్పుడుల్లా ప్రధాని నరేంద్రమోదీతో ప్రచార సభలు నిర్వహించి... పదేపదే అభివృద్ధి మంత్రం జపించింది. అయినప్పటికీ నవీన్ పట్నాయక్​ను ఢీ కొట్టలేకపోయింది.

ఇదీ చూడండి : కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా..!

New Delhi, May 23 (ANI): Ahead of LS election results, Bharatiya Janata Party (BJP) leader Manoj Tiwari performed hawan at his residence in Delhi on Thursday. He is BJP's candidate from North East Delhi parliamentary constituency. While speaking to ANI, Tiwari said, "Conspiracy has been made against an innocent leader PM Narendra Modi, who works on the ideology for 'Sabka Saath, Sabka Vikas'. People of the country have fought for PM Modi. I am sure that the results today will be in favor of BJP. We will get 350+ seats, I am sure."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.