అధికారుల నిర్లక్ష్యంతో ఏడు రోజుల పాటు మూత్రశాలలో క్వారంటైన్లో ఉన్నాడు ఓ ఒడిశా వాసి.
పొమ్మని తరిమారు...
మానస్ పాత్ర(28) తమిళనాడులో ఓ కంపెనీలో పనిచేసేవాడు. కరోనా విజృంభిస్తున్న వేళ స్వరాష్ట్రం ఒడిశాకు చేరుకున్నాడు. దీంతో మానస్‌ను జగత్ సింగ్‌పుర్ ఆసుపత్రిలో నిర్బంధించారు అధికారులు. ఏడు రోజుల తర్వాత .. అతడిని మరో ఏడు రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని తక్షణమే ఇంటికి వెళ్లాలన్నారు ఆసుపత్రి సిబ్బంది.
ఆరుగురు సభ్యులుండే మానస్ ఇంట్లో.. హోం క్వారంటైన్ ఉండేంత స్థలం గానీ, వసతులు గానీ లేవన్నాడు. మరో ఏడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండేందుకు అనుమతివ్వాలని మొరపెట్టుకున్నాడు. క్వారంటైన్ కేంద్రంలో ఉండనివ్వమని బతిమాలాడు. అయినా.. వినలేదు, ఇంటికి వెళ్లాల్సిందే అన్నారు సిబ్బంది.
గత్యంతరం లేక, జూన్ 9న జాముగాంవ్ గ్రామంలోని ఇంటికి చేరుకున్నాడు మానస్. కుటుంబసభ్యులకు తన నుంచి కరోనా సోకే ముప్పుందని.. స్వచ్ఛ భారత్ యోజన కింద కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డిలో హోం క్వారంటైన్లో ఉండేందుకు సిద్ధమయ్యాడు. మూటా ముళ్లె మూత్ర శాలలో పెట్టుకుని, ఏడు రోజుల పాటు టాయ్లెట్లోనే పడక, భోజనం కానిచ్చాడు.
ఇదీ చదవండి:కరోనా వేళ గుదిబండగా మారిన గృహహింస