ETV Bharat / bharat

దిల్లీ ఐటీఓ వద్ద ఆందోళన ఉద్రిక్తం- రైతు మృతి

దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. సెంట్రల్​ దిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో పోలీసులు-రైతులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక రైతు మృతి చెందడం కలకలం రేపింది.

attack police personnel and vandalise police vehicle at ITO in central Delhi
ఉద్రిక్తతల నడుమ గణతంత్ర దినోత్సవ ట్రాక్టర్​ ర్యాలీ
author img

By

Published : Jan 26, 2021, 2:01 PM IST

Updated : Jan 26, 2021, 4:58 PM IST

రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో భాగంగా దిల్లీలోని ఐటీఓ వద్ద ఆందోళనలో ఒక రైతు మరణించాడు. ఈ ఘటనకు పోలీసులే కారణమని మృతుని బంధువులు ఆరోపించారు. అయితే ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ తిరగబడటం వల్లే ఐటీవో వద్ద రైతు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. తమ కాల్పుల్లో రైతు మరణించాడన్న ఆరోపణలను ఖండించారు. మృతుడి ఒంటిపై బుల్లెట్​ గాయాలు లేవని స్పష్టం చేశారు.

మృతదేహంతో నిరసన..

మరోవైపు రైతు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించకుండా అడ్డుకున్న రైతులు.. జాతీయ జెండా కప్పి ఐటీఓ క్రాసింగ్ వద్ద నిరసనకు దిగారు. ఈ ఘటనలో మీడియాపైనా రైతులు విరుచుకుపడ్డారు.

ర్యాలీలో భాగంగా పోలీసు ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న బారికేడ్లను దాటుకొని ముందుకెళ్లారు రైతులు. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు.. బాష్పవాయువును ప్రయోగించారు.

ఈ నేపథ్యంలో ఐటీఓ వద్ద జరిగిన ఘర్షణల్లో రైతు మృతి చెందాడు. ఆగ్రహంతో పోలీసులను పరుగెత్తించిన అన్నదాతలు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

ఐటీఓ సర్కిల్​లో దిల్లీ ప్రజా రవాణా బస్సును సైతం ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి: ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్

Last Updated : Jan 26, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.