ETV Bharat / bharat

ఆ ఐసిస్​ ఉగ్రవాది అరెస్టుతో భారీ ఉగ్ర కుట్ర భగ్నం - దిల్లీ ఉగ్రవాదం

దిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు ఒక ఐసిస్‌ ఉగ్రవాది పన్నిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో వలపన్ని.. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలో.. దాడి చేసేందుకు తెచ్చిన ఐఈడీలను నిర్వీర్యం చేశారు. సిరియాకు చెందిన ఐసిస్​ కమాండర్లతో అతడికి నేరుగా సంబంధాలున్నట్లు  తెలిపిన పోలీసులు.. మరిన్ని ఉగ్రమూలాలను తేల్చేపనిలో నిమగ్నమయ్యారు.

NSG commandos, bomb squad to analyse IEDs recovered from ISIS suspect in Delhi
ఎన్​ఎస్​జీ కమాండోల చేతిలో దిల్లీ ఐఈడీ
author img

By

Published : Aug 22, 2020, 5:38 PM IST

దిల్లీలో ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ముష్కరుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దిల్లీలోని రిడ్జ్‌ రోడ్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి.. కాల్పులు జరిపిన మహమ్మద్‌ ముస్తకీమ్‌ ఖాన్‌ అనే ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రెండు శక్తిమంతమైన ఐఈడీ బాంబులు సహా ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనం మీద వెళ్తున్న అతడిని ఆపి తనిఖీ చేయగా, బాంబులను పోలీసులు గుర్తించారు. అతడిని నిలువరించడానికి యత్నిస్తుండగా.. ముస్తకీమ్ పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. ధౌలా కువాన్, కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత.. శుక్రవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశామని ప్రత్యేక బృందం డీసీపీ ప్రమోద్‌ కుశ్వాహ వెల్లడించారు.

2015 నుంచే...

ఉగ్రవాదిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరామ్‌పుర్‌కు చెందిన.. మహమ్మద్‌ ముస్తకీమ్‌ ఖాన్ అలియాస్‌ అబూ యూసఫ్‌గా గుర్తించారు. కాస్మొటిక్స్‌ షాపులో పనిచేసే.. మహమ్మద్‌ ముస్తకీమ్‌.. సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్‌కు ఆకర్షితుడైనట్లు కుశ్వాహ తెలిపారు. 2015 నుంచి ముస్తకీమ్​ ఐసిస్ కోసం పనిచేస్తున్నట్లు, అతనిపై ఏడాదిగా నిఘా పెట్టినట్లు వెల్లడించారు. దిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. ప్రెజర్ కుక్కర్‌లో.. ఐఈడీ బాంబులను ఉంచి, దాడికి కుట్ర పన్నాడని ప్రమోద్‌ కుశ్వాహ తెలిపారు. ముస్తకీమ్‌కు అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్‌ కమాండర్లకు నేరుగా సంబంధాలున్నాయని.. వారే భారత్‌లో దాడి చేయాలని ఆదేశాలిచ్చినట్లు డీసీపీ ప్రమోద్‌ చెప్పారు.

''అఫ్గానిస్థాన్‌ ఖొరసాన్‌ ఫ్రావిన్స్‌లోని ఐసిస్‌ శాఖలో పాక్‌కు చెందిన అబూ హుజఫా పర్యవేక్షణలో ఇతను ఉండేవాడు. అఫ్గానిస్థాన్‌లో డ్రోన్ల దాడిలో హుజఫా మరణించిన తర్వాత ముస్తకీమ్‌ ఐసిస్‌కు చెందిన మరో వ్యక్తి పర్యవేక్షణలో ఉన్నాడు. భారత్‌లో దాడి చేయమని కొత్త పర్యవేక్షకుడు ఆదేశాలిచ్చాడు. ఆ ఆదేశాలనుసారంగా ముస్తకీమ్‌ దిల్లీకి వచ్చాడు. జనసమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఐఈడీలను పెట్టాలని భావించాడు. ఈ పేలుడు పదార్థాలు పనిచేస్తాయా లేదా అన్న విషయాన్ని.. తన గ్రామంలో కొన్ని నెలల క్రితం పరిశీలించినట్లు చెప్పాడు. కొవిడ్‌ నిబంధనల వల్ల అతడి కదలికలు పరిమితమయ్యాయి. ఆగస్టు 15న దిల్లీలో దాడికి ప్రయత్నించాలనుకున్నాడు. అయితే.. కట్టుదిట్టమైన భద్రత ఉండడం వల్ల ధైర్యం సరిపోలేదు. మొత్తానికి నిన్న ఇక్కడికి రాగానే పట్టుబడ్డాడు.''

--- ప్రమోద్ కుశ్వాహ, డీజీపీ దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం

ఐసిస్‌ ఉగ్రవాది అరెస్టుతో... భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రిడ్జ్‌ రోడ్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్​ఎస్​జీ కమాండోలు.. ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రెజర్ కుక్కర్‌లో ఉంచిన ఐఈడీ బాంబులను, రోబో సాయంతో ఎన్​ఎస్​జీ బాంబు స్క్వాడ్‌ బృందం నిర్వీర్యం చేసింది. రిడ్జ్‌ రోడ్ ప్రాంతంలోని బుద్ద జయంతి పార్క్ పరిసర ప్రాంతంలో ముష్కరులు ఎవరైనా ఉన్నారెమోనని.. జాతీయ భద్రతా దళాలు, దిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. దిల్లీ సరిహద్దుల వెంబడి ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల పోలీసు అధికారులను ఆ రాష్ట్ర డీజీపీ అప్రమత్తం చేశారు.

ఇదీ చూడండి:- 'దిల్లీ, అయోధ్యలో బాంబు దాడుల పేరిట బెదిరింపు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.