ETV Bharat / bharat

యూపీఎస్​సీ ఆశావహులకు కేంద్రం షాక్​! - కొవిడ్​ వల్ల సివిల్​ సర్వీసెస్​ పరీక్షలు రాయని అభ్యర్థులు

కొవిడ్​ మహమ్మారి కారణంగా యూపీఎస్​సీ పరీక్షలకు హాజరు కానివారి కోసం మరో అవకాశాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా లేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది.

Not in favour of granting extra chance to UPSC aspirants
'వారికోసం పరీక్షలను మళ్లీ నిర్వహించలేం'
author img

By

Published : Jan 22, 2021, 12:56 PM IST

సివిల్​ సర్వీసెస్​ ఆశావహులకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు సానుకూలంగా లేమని సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించింది.

కొవిడ్​ మహమ్మారి కారణంగా గతేడాదిలో యూపీఎస్​సీ పరీక్షలు రాయలేని అభ్యర్థుల కోసం మరోసారి పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైెంది. దీనిపై జస్టిస్​ ఏఎమ్​ ఖాన్​విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్​ జనరల్​ ఎస్​వీ రాజు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. ఈ విషయంలో ప్రమాణ పత్రం​ దాఖలు చేసేందుకు సమయం కావాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం జనవరి 25కు విచారణను వాయిదా వేసింది. అప్పటిలోగా అఫిడవిట్​ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అయితే.. అంతకుముందు సివిల్​ సర్వీసెస్​ ఔత్సాహికుల కోసం మరోసారి పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ధర్మాసనానికి సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా తెలపడం గమనార్హం.

ఇదీ చూడండి:కేంబ్రిడ్జ్​ అనలిటికాపై సీబీఐ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.