ETV Bharat / bharat

కరోనా కాదు.. ఐపీఎల్​పైనే మనోళ్ల ఆసక్తి

గూగుల్​లో ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కీవర్డ్​గా 'ఐపీఎల్' నిలిచింది. ఈ సంవత్సరం హాట్​ టాపిక్​గా ఉన్న 'కరోనా వైరస్​'తో పోలిస్తే ఐపీఎల్​తోనే ఎక్కువ సెర్చ్​లు జరిగాయని గూగుల్ వెల్లడించింది. మొత్తంగా భారతీయులు ఈ ఏడాది వేటిని ఎక్కువగా శోధించారనే అంశంపై జాబితా రూపొందించింది.

Not coronavirus, IPL is top trending query on Google India Search 2020
కరోనా కాదు.. ఐపీఎల్​పైనే మనోళ్ల ఆసక్తి
author img

By

Published : Dec 9, 2020, 4:32 PM IST

Updated : Dec 9, 2020, 5:01 PM IST

భారతీయులకు క్రికెట్ అంటే ఎంత మక్కువో మరోసారి రుజువైంది. ప్రపంచాన్నంతా ఆవహించిన కరోనా సంక్షోభంలోనూ ఈ ఆటకు క్రేజ్ తగ్గలేదని నిరూపితమైంది. గూగుల్​లో ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కీవర్డ్స్ జాబితాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కరోనా వైరస్ పదంతో పోలిస్తే ఐపీఎల్​తోనే ఎక్కువ శోధనలు జరిగాయని గూగుల్ వెల్లడించింది. ఈ మేరకు భారత్​లో అత్యధిక మంది వేటిని సెర్చ్ చేశారనే విషయాలపై జాబితా రూపొందించింది.

క్రీడలు, వార్తల విభాగంలోనూ ఐపీఎల్ కీవర్డే సత్తా చాటింది. ఆ తర్వాత కరోనా వైరస్ నిలిచింది. అమెరికా ఎన్నికల ఫలితాలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్ పథకం), బిహార్ ఎన్నికల ఫలితాలు, దిల్లీ ఎన్నికల ఫలితాలు, నిర్భయ కేసు, లాక్​డౌన్, భారత్-చైనా ఉద్రిక్తతలు, రామ మందిరం పదాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

కరోనా కారణంగా తొలుత వాయిదా పడిన ఐపీఎల్ పదమూడో సీజన్.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్య నిర్వహించారు. మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే వ్యూయర్​షిప్ మాత్రం రికార్డులు తిరగరాసింది. గతేడాదితో పోలిస్తే 28 శాతం అధికంగా ఐపీఎల్​ను వీక్షించారు. ఈ సంవత్సరం ఐపీఎల్​ గురించి అత్యధిక మంది వెతికితే 2019లో 'ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్' గురించి భారతీయులు ఎక్కువగా శోధించారు.

ఇదీ చదవండి: ఈ ఏడాది ట్విట్టర్​లో సందడంతా ఈ ట్వీట్స్​దే!

మరోవైపు, అత్యధిక మంది సెర్చ్ చేసిన క్రీడా ఈవెంట్లలో యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్, లా లీగా చోటు దక్కించుకున్నాయి.

వ్యక్తుల గురించి

ఎక్కువ మంది శోధించిన ప్రముఖుల జాబితాలో అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్, ముంబయి పోలీసుల అరెస్టుతో వార్తల్లోకెక్కిన జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, సింగర్ కనికా కపూర్ పేర్లు ఉన్నాయి.

నాలుగో స్థానంలో కిమ్ జోంగ్ ఉన్, ఐదో స్థానంలో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. కంగనా రనౌత్, రియా చక్రవర్తి, అంకితా లోఖండే సైతం చోటు దక్కించుకున్నారు.

ఎక్కువ మంది శోధించిన సినిమాలు

  1. సుశాంత్ సింగ్ నటించిన 'దిల్ బెచారా'
  2. సూరారై పొట్రు(సూర్య)
  3. తానాజీ(అజయ్ దేవగణ్)
  4. శకుంతలా దేవీ(విద్యా బాలన్)
  5. గుంజన్ సక్సేనా(జాన్వీ కపూర్)

ఎక్కువ మంది శోధించిన టీవీ/వెబ్​ సిరీస్​లు

  1. మనీ హెయిస్ట్
  2. స్కామ్ 1992: హర్షద్ మెహతా స్టోరీ
  3. బిగ్​బాస్ 14(హిందీ)
  4. మిర్జాపుర్ 2
  5. పాతాళ్ ​లోక్

ఎలా..? అనే ప్రశ్నతో అత్యధిక సెర్చ్​లు నమోదయ్యాయి. అందులో టాప్​లో నిలిచినవి..

  1. పనీర్ తయారు చేయడం ఎలా?
  2. ఇమ్యునిటీ పెంచుకోవడం ఎలా?
  3. దాల్గోనా కాఫీ తయారు చేయడం ఎలా?
  4. పాన్​ కార్డును ఆధార్​తో లింక్ చేయడం ఎలా?
  5. ఇంట్లో శానిటైజర్ తయారు చేయడం ఎలా?

కొత్త విషయాల గురించి తెలుసుకొనేందుకు భారతీయులు ఏం సెర్చ్ చేశారంటే..

  1. కరోనా వైరస్ అంటే ఏంటి?
  2. బినోద్ అంటే ఏంటి?
  3. కొవిడ్-19 అంటే ఏంటి?
  4. ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?
  5. సీఏఏ అంటే ఏంటి?

చుట్టుపక్కల ఏమున్నాయి?

మనకు కావాల్సిన ప్రదేశాలు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనే 'నియర్ మీ' ఫీచర్​ ద్వారా ఫుడ్ షెల్టర్ల గురించి భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత కొవిడ్ టెస్టులు, టపాసుల దుకాణాలు, లిక్కర్ షాపులు, నైట్ షెల్టర్ల గురించి వెతికారు.

ఇదీ చదవండి: రాజకీయాల్లో మోదీ పోస్టుకే అత్యధిక రీట్వీట్లు

Last Updated : Dec 9, 2020, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.