కరోనా వైరస్ కల్లోలం కారణంగా భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వంటివి మన జీవితంలో భాగమయ్యాయి. దీనికి సంబంధించి విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. షేర్ చేసిన ఓ చిత్రం పరిస్థితులకు అద్దం పడుతోంది. లాక్డౌన్ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొచ్చిన ఓ విమానంలోని చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులందరు ఫేస్ షీల్డులు ధరించారు. చూడటానికి సైంటిఫిక్ చిత్రంలోని దృశ్యంలా కనిపించింది.
" కాలాలు మారుతున్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ చిత్రంలోని దృశ్యం కాదు. సింగపూర్ నుంచి ముంబయి వచ్చిన విమానంలోని ప్రయాణికుల పరిస్థితి. నివారణ చర్యలు సరికొత్తగా ఉన్నాయి" అని హర్దీప్ ట్వీట్ చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్', 'సముద్ర సేతు' కింద ప్రత్యేక విమానాలు, ఓడలు ఏర్పాటు చేసింది.
-
The times they are a changing!
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Not a scene from a sci-fi blockbuster but a picture of passengers with face shields onboard the Singapore-Mumbai flight which landed earlier today.
Preventive measures are the new normal.
Changes are here to stay.@MoCA_GoI @airindiain pic.twitter.com/xMRvYS549Z
">The times they are a changing!
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 10, 2020
Not a scene from a sci-fi blockbuster but a picture of passengers with face shields onboard the Singapore-Mumbai flight which landed earlier today.
Preventive measures are the new normal.
Changes are here to stay.@MoCA_GoI @airindiain pic.twitter.com/xMRvYS549ZThe times they are a changing!
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 10, 2020
Not a scene from a sci-fi blockbuster but a picture of passengers with face shields onboard the Singapore-Mumbai flight which landed earlier today.
Preventive measures are the new normal.
Changes are here to stay.@MoCA_GoI @airindiain pic.twitter.com/xMRvYS549Z
పూరికి థరూర్ లేఖ
విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను తీసుకొస్తున్న విమానాలను కేరళ రాజధాని తిరువనంతపురం విమాశ్రయంలో ల్యాండ్ అయ్యేలాా చర్యలు తీసుకోవాలని హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్. ప్రస్తుతం కేరళ ప్రాంతానికి చెందిన వారిని తీసుకొస్తున్న విమానాలు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు వెళ్తున్నాయి. దీని వల్ల కేరళ దక్షిణ ప్రాంతాల ప్రజలు సొంత ఊర్లకు చేరుకోవడానికి ఇబ్బందవుతుందన్నారు. తిరువనంతపురం విమానాశ్రయం అయితే పొరుగు జిల్లాలు కొల్లం, పథానంతిట్ట సహా తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతాలకు వెళ్లేవారికి వారికి సౌకర్యంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు థరూర్.