పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సతీమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ముంబై ప్రత్యేక కోర్టు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అదనపు ఛార్జ్‌షీట్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. అజ్మీ. కొత్తగా చేర్చిన ఛార్జ్‌షీట్‌లో నేరానికి సంబంధించిన ఇతర ఆధారాలనుపొందుపరిచారు అధికారులు.
అంతర్జాతీయ బ్యాంకు ఖాతా నుంచి 30 మిలియన్ డాలర్లను అమీ మోదీ తరలించారని పేర్కొంది ఈడీ. ఈ మొత్తంతో అమెరికాలోని న్యూయార్క్లోఆస్తిని కొనుగోలు చేసినట్లు తెలిపింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులతో కుమ్మక్కయి రూ. 14వేల కోట్ల రుణాల్ని మోదీ, ఆయన బంధువు మెహుల్ ఛోక్సీ ఎగవేశారని గతేడాది మే నెలలో దాఖలు చేసిన తొలి ఛార్జ్షీట్లోఈడీ పేర్కొంది. 2018లో కుంభకోణం వెలుగుచూసే వరకుఏడేళ్లపాటు ఇదే తంతు కొనసాగించారనిఅధికారులు వెల్లడించారు.
నీరవ్‌మోదీ లండన్‌లోని ఓవిలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్న విషయాన్ని బ్రిటన్ వార్తా సంస్థ గతవారం బయటపెట్టింది.