ETV Bharat / bharat

మోదీతో సంభాషణపై ట్రంప్​ చెప్పింది అబద్ధమేనా!

author img

By

Published : May 29, 2020, 10:07 AM IST

Updated : May 29, 2020, 10:13 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ మాట్లాడలేదని ప్రకటించాయి ప్రభుత్వ వర్గాలు. ఏప్రిల్ నెలలో హైడ్రాక్సీ క్లోరోక్విన్​పై జరిగిన చర్చే ఇరునేతల మధ్య చివరి సంభాషణ అని చెప్పాయి. చైనాతో సరిహద్దు అంశమై అధ్యక్షుడు మోదీతో మాట్లాడలేదని వెల్లడించాయి.

modi trump
'ట్రంప్​తో మోదీ సంభాషణ జరగలేదు'

చైనాతో సరిహద్దు అంశమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంభాషణ వార్తలపై భారత్​ అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ మధ్య కాలంలో అధ్యక్షుడు ట్రంప్​తో.. ప్రధాని మోదీ మాట్లాడలేదని పేర్కొన్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీతో సంభాషించానని ట్రంప్ ప్రకటించడంపై పైవిధంగా స్పందించాయి. డొనాల్డ్​తో ఏప్రిల్ 4నే చివరిసారిగా ప్రధాని మోదీ మాట్లాడారని వెల్లడించాయి.

"2020, ఏప్రిల్ 4నే చివరిసారిగా ట్రంప్​తో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంశమై ప్రధాని మోదీ సంభాషించారు. చైనా విదేశాంగ శాఖతో సంప్రదింపుల అంశమై చర్చిస్తున్నట్లు గురువారమే ప్రకటించాం. దౌత్య విధానాల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నాం."

-భారత్ ప్రకటన

తాజా మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు అధ్యక్షుడు ట్రంప్. భారత్, చైనా అంశమై మాట్లాడిన ఆయన మోదీ గొప్ప వ్యక్తి అని చెప్పారు. జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహులా ప్రధాని మోదీ కూడా తనకు అత్యంత సన్నిహితులని చెప్పుకొచ్చారు ట్రంప్.

భారత్​లో తనకొచ్చిన ప్రజాదరణపైనా స్పందించారు ట్రంప్. అమెరికా మీడియా కంటే భారత ప్రజలే తనను ఎక్కువగా అభిమానిస్తారని చెప్పారు.

ఇదీ చూడండి: సరిహద్దు అంశమై మోదీ సంతృప్తిగా లేరు: ట్రంప్

Last Updated : May 29, 2020, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.