ETV Bharat / bharat

'ఏ శక్తీ బాధిత కుటుంబసభ్యుల గొంతును నొక్కలేదు' - హథ్రస్​ కాంగ్రెస్​

హాథ్రస్​ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ బృందం పరామర్శించింది. బాధితురాలి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని వారు హామీనిచ్చారు. అయితే పర్యటనకు తొలుత అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ-నోయిడా వంతెన వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

No power in the world can suppress the family's voice: Congress' Rahul Gandhi after meeting family of the alleged gangrape victim in Hathras.
'ఏ శక్తి వారి గొంతును అణచివేయలేదు'
author img

By

Published : Oct 3, 2020, 9:24 PM IST

Updated : Oct 3, 2020, 10:15 PM IST

ప్రపంచంలో ఏ శక్తి కూడా.. హాథ్రస్​ బాధితురాలి కుటుంబ సభ్యుల గొంతును అణచివేయలేదని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఉద్ఘాటించారు. ఉద్రిక్తతల మధ్య.. బూల్​గదిలోని బాధితురాలి కుటుంబసభ్యులను కాంగ్రెస్​ బృందం పరామర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్​, ప్రియాంక గాంధీ

'అప్పటివరకు పోరాటం ఆగదు...'

బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని ప్రియాంక గాంధీ తేల్చిచెప్పారు. కుటుంబ సభ్యులకు బాధితురాలి చివరి చూపు కూడ దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తన బాధ్యతలను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

No power in the world can suppress the family's voice: Congress' Rahul Gandhi after meeting family of the alleged gangrape victim in Hathras.
మీడియాతో మాట్లాడుతున్న రాహుల్​- ప్రియాంక

అనుమతి లేదని...

అంతకుముందు.. రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు మధ్యాహ్నం దిల్లీ నుంచి హాథ్రస్​కు బయలుదేరారు. కాంగ్రెస్​ కార్యకర్తలు కూడా వారిని అనుసరించారు.

ఇదీ చూడండి:- హాథ్రస్​ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం సిఫార్సు

అయితే రాహుల్​ గాంధీ బృందానికి హాథ్రస్​లో పర్యటించేందుకు అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బృందాన్ని అడ్డుకునేందుకు దిల్లీ-నోయిడా వంతెన వద్ద భారీగా బలగాలను మోహరించారు.

దిల్లీ-నోయిడా వంతెన వద్ద

కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న రాహుల్​ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్​ కార్యకర్తలు- పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నించారు.

అనంతరం హాథ్రస్​లో పర్యటించడానికి రాహుల్​కు అనుమతి లభించింది. అయితే కేవలం ఐదుగురే హాథ్రస్​కు వెళ్లొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఫలితంగా రాహుల్, ప్రియాంక వెంట అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్‌ హాథ్రస్​కు వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

బాధితురాలి కుటుంబసభ్యులతో నేతలు

దర్యాప్తుపై అసంతృప్తి...

ఘటన దర్యాప్తుపై హత్యాచార బాధితురాలి సోదరుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు ఇంకా ఎలాంటి సమాధానాలు లభించలేదన్నారు. తమ కుటుంబాన్ని బెదిరించిన జిల్లా మేజిస్ట్రేట్​ ఇంకా సస్పెండ్​ అవ్వలేదని.. బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం'

Last Updated : Oct 3, 2020, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.