దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో మెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా ఒక్కరు కూడా వైరస్ బారిన పడలేదని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేసుల రెట్టింపు సమయం 12.6 రోజులకు మెరుగుపడినట్లు స్పష్టం చేసింది.
9రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులేవీ నమోదు కాలేదు. అవి.. అండమాన్ నికోబార్ ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, గోవా, ఛత్తీస్గఢ్, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం.
హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం 8గంటల వరకు(24 గంటల్లో) 122 మంది కరోనాకు బలయ్యారు. 3,525 కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు 3.2 శాతం ఉండగా.. రికవరీ రేటు 32.8 శాతంగా ఉందన్నారు హర్షవర్ధన్.