హిందీ భాషను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బోధించాలని జాతీయ విద్యా విధాన ముసాయిదా సిఫారసు చేస్తోంది. దీని అమలుపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ట్విట్టర్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్.
-
The National Education Policy as submitted to the Minister HRD is only a draft report. Feedback shall be obtained from general public. State Governments will be consulted. Only after this the draft report will be finalised. GoI respects all languages. No language will be imposed
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The National Education Policy as submitted to the Minister HRD is only a draft report. Feedback shall be obtained from general public. State Governments will be consulted. Only after this the draft report will be finalised. GoI respects all languages. No language will be imposed
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 2, 2019The National Education Policy as submitted to the Minister HRD is only a draft report. Feedback shall be obtained from general public. State Governments will be consulted. Only after this the draft report will be finalised. GoI respects all languages. No language will be imposed
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 2, 2019
"జాతీయ విద్యావిధానం ముసాయిదా నివేదిక మాత్రమే మానవ వనరులు అభివృద్ధి శాఖకు అందింది. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి. ఆ తర్వాతే ముసాయిదాపై తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తుంది. ఏ భాషనూ బలవంతంగా రుద్దబోం."
-జై శంకర్ ట్వీట్.
విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అడుగు జాడల్లో నడుస్తున్నారు నూతన మంత్రి జై శంకర్. ఆదివారం ట్విట్టర్లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలిచ్చారు.
హిందీ బోధనను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్న సిఫారసుపై తమిళనాడు రాజకీయ పార్టీలు డీఎంకే, ఎంఎన్ఎమ్లు తీవ్రంగా స్పందించాయి.
విద్యావిధానంపై ఓ కమిటీ ముసాయిదా రూపొందించిదని, దాని అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదని మానవ వనరుల శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత సమాచార, ప్రచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'జై శ్రీరామ్‌ను పార్టీ నినాదంగా వినియోగిస్తున్నారు'