ETV Bharat / bharat

'అక్టోబర్​ వరకు రైతు ఉద్యమాన్ని ఆపేది లేదు'

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 69 రోజులుగా అన్నదాతలు చేస్తోన్న పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. రైతులకు మద్దతు పెరుగుతుండటం వల్లే ప్రభుత్వం భయపడుతోందని కిసాన్​ మోర్చా ఆరోపించింది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఇళ్లకు వెళ్లేది లేదని రైతు నాయకుడు రాకేశ్​ టికాయత్​ ప్రభుత్వాన్నిహెచ్చరించారు.

Samyukt Kisan Morcha
'చట్టాలు వెనక్కి తీసుకోకపోతే.. ఇళ్లకు వెళ్లేది లేదు'
author img

By

Published : Feb 2, 2021, 3:45 PM IST

సాగు చట్టాలపై రైతుల పోరాటం మరింత ఉద్ధృతంగా సాగుతోంది. పోలీసులు, అధికారులు తమపై వేధింపులు ఆపేవరకు, అరెస్ట్​ చేసిన రైతులను విడిచిపెట్టేవరకు ప్రభుత్వంతో చర్చలు జరిపే సమస్యే లేదని సంయుక్త కిసాన్ మోర్చా తేల్చిచెప్పింది.

"బారీకేడ్లను పెంచడం, గోతులు తవ్వడం, రోడ్లపై మేకులు, కంచెలు ఏర్పాటు చేయడం, అంతర్గత రోడ్లను మూసివేయడం, అంతర్జాల సేవలను నిలిపివేయడం, భాజపా-ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలతో మమ్మల్ని రెచ్చగొట్టడం.. ఇవన్నీ మాకు వ్యతిరేకంగా ప్రభుత్వం తమ పోలీసులు, అధికాయ యంత్రాంగంతో చేయిస్తున్నవే."

- సంయుక్త కిసాన్​ మోర్చా

అంతర్జాలన్ని తరచుగా నిషేధించడం, రైతులకు సంబంధిచిన ట్విట్టర్​ ఖాతాలను నిలిపివేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యంపై ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడిగా కిసాన్ మోర్చా అభివర్ణించింది. రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు పెరుగుతుండటం చూసి ప్రభుత్వం భయపడుతోందని పేర్కొంది.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనలకు సంబంధం ఉన్న అనేకమంది రైతుల, రైతు సంఘాల ఖాతాలను ట్విట్టర్​ నిలిపివేసింది. జాబితాలో కిసాన్‌ ఏక్తా మోర్చా, బీకేయూ ఏక్తా ఉర్గహన్‌ ఉన్నాయి. వీటితో పాటు పలువురు వ్యక్తులు, సంస్థల ఖాతాలను కూడా ట్విట్టర్‌ నిలిపేసింది

ఇళ్లకు వెళ్లేది లేదు..

రైతుల ఉద్యమానికి విపక్షాలు మద్దతు పలకడాన్ని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయత్ స్వాగతించారు. అయితే ఉద్యమాన్ని రాజకీయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

"మా నినాదం ఒకటే.. 'చట్టాలను వెనక్కి తీసుకోకపోతే.. రైతులు ఇళ్లకు వెళ్లేది లేదు'. అక్టోబర్​ వరకు ఈ ఉద్యమం ఆగదు. మాకు మద్దతుగా ప్రతిపక్షాలు ఇక్కడికి వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాయకులు వస్తే మేం ఏం అడ్డు చెప్పం. ట్రాఫిక్​కు మేం అంతరాయం కలిగించలేదు. పోలీసులే బారీకేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నారు."

- రాకేశ్​ టికాయత్, బీకేయూ నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.