ETV Bharat / bharat

'భారత సైన్యం గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు' - భారత్ చైనా వివాదం రాజ్​నాథ్ రాజ్యసభ ప్రకటన

భారత్-చైనా సరిహద్దులో తాజా పరిస్థితిపై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. ఒప్పందాలను చైనా ఉల్లంఘించడం వల్లే ఘర్షణ తలెత్తిందని చెప్పారు. చర్చలు సాగిస్తున్న సమయంలోనే యథాతథ స్థితి మార్చేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. సరిహద్దులో చైనా భారీగా దళాలను సమీకరించిందని, అందుకు ప్రతిగా భారత్ సైతం సైన్యాన్ని మోహరించిందని తెలిపారు.

No force can stop Indian troops from patrolling: Rajnath on border row
'సైన్యం గస్తీ నిర్వహించకుండా ఏ శక్తి అడ్డుకోలేదు'
author img

By

Published : Sep 17, 2020, 6:16 PM IST

Updated : Sep 17, 2020, 6:21 PM IST

లద్దాఖ్​ సరిహద్దులో భారత సైన్యం గస్తీ నిర్వహించకుండా ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు చర్చలు సాగిస్తున్న సమయంలోనే యథాతథ స్థితి మార్చేందుకు ఆగస్టు 29-30న చైనా ప్రయత్నించిందని చెప్పారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో రెచ్చగొట్టేలా సైనిక విన్యాసాలకు పాల్పడిందని తెలిపారు.

"ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత సైనికులు గస్తీ నిర్వహించకుండా ఆపలేదు. మన సైనికులు ఇందుకోసమే ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఈ సమస్య(గస్తీ నిర్వహించడం)పైనే ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని స్పష్టం చేస్తున్నా."

-రాజ్​నాథ్ సింగ్ రక్షణ మంత్రి

ఒప్పందాల ఉల్లంఘన

1988 తర్వాత భారత్‌, చైనా అనేక ఒప్పందాలు చేసుకున్నాయని రాజ్​నాథ్ తెలిపారు. చైనా చెప్పేదానికి, చేసేదానికి పొంతన కుదరడంలేదని ఆక్షేపించారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని ఆయన చైనాకు హితవు పలికారు.

"చర్చలు జరుగుతున్న సమయంలోనూ గత నెల రోజులుగా చైనా సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ఈ చర్యల ద్వారా వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తున్నాయని స్పష్టమవుతోంది. సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరించడం 1993, 1996 ఒప్పందాలకు విరుద్ధం."

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

గల్వాన్ లోయలోని పలు ప్రాంతాల్లో భారత సైనికులు గస్తీ నిర్వహించడానికి అనుమతించడంలేదని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రాజ్​నాథ్.

వివాదంపై వివరణ

ఏప్రిల్ నుంచి సరిహద్దులో సైనికులు, ఆయుధాలను చైనా మోహరించడాన్ని భారత్ గమనించిందని రాజ్​నాథ్ తెలిపారు. భారత సైనికుల సంప్రదాయ గస్తీకి ఆటంకం కలిగించిందని చెప్పారు. ఫలితంగా ప్రతిష్టంభన ఏర్పడినట్లు స్పష్టం చేశారు. వీటిని పరిష్కరించే సమయంలోనూ చైనా సైన్యం ఎల్​ఏసీని అతిక్రమించేందుకు మే నెలలో ప్రయత్నాలు చేసిందని వివరించారు. వీటిని భారత సైన్యం తగిన రీతిలో అడ్డుకుందని పేర్కొన్నారు. ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు చేసే ప్రయత్నాలను సహించేది లేదని చైనాకు దౌత్య, సైనిక మార్గాల్లో స్పష్టం చేసినట్లు తెలిపారు.

ఎల్​ఏసీ వెంబడి ఘర్షణలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇరుదేశాల సీనియర్ కమాండర్లు జూన్ 6న సైనిక ఉపసంహరణకు అంగీకారానికి వచ్చారని తెలిపారు రాజ్​నాథ్. ఎల్​ఏసీని పరస్పరం గౌరవిస్తూ.. యథాతథ స్థితిని మార్చేసే చర్యలు చేపట్టకూడదని తీర్మానించినట్లు వెల్లడించారు. అయితే ఈ ఒప్పందానికి చైనా విఘాతం కలిగించడం వల్లే జూన్ 15న గల్వాన్​లో హింసాత్మక ఘర్షణ జరిగిందని చెప్పారు. రెచ్చగొట్టే చర్యల సమయంలో భారత సైన్యం నిగ్రహం పాటించడమే కాకుండా దేశ సమగ్రతను కాపాడేందుకు శౌర్యపరాక్రమాలను ప్రదర్శించిందని పేర్కొన్నారు.

"చైనా సైన్యం ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లే జూన్ 15న గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగింది. భారత వీర జవాన్లు ఈ ఘటనలో ప్రాణాలు అర్పించారు. చైనా వైపు ప్రాణనష్టం కలిగించి భారత సైనికులు దెబ్బకొట్టారు."

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

ఇలాంటి సున్నితమైన విషయంపై పార్లమెంటులో చర్చ చేపట్టకూడదని ప్రభుత్వ, విపక్షాలు అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో రాజ్​నాథ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. అయితే సందేహాలు ఏవైనా ఉంటే నివృతి చేసుకునేందుకు సభ్యులకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అవకాశం ఇచ్చారు.

సరిహద్దు రేఖపై

సరిహద్దుపై చైనా, భారత్ ఎలాంటి పరిష్కారానికి రాలేదని స్పష్టం చేశారు రాజ్​నాథ్. ఆచార, సంప్రదాయాల అమరికతో సరిహద్దు ఏర్పడిందన్న భారత వాదనను చైనా అంగీకరించడం లేదని తెలిపారు.

"భౌగోళిక సూత్రాలు, ఒప్పందాలతో పాటు ఇరుదేశాలకు సుపరిచితమైన చరిత్ర ఆధారంగా సరిహద్దు ఏర్పడిందని మేం నమ్ముతున్నాం. ఇరుదేశాల మధ్య సరిహద్దును అధికారికంగా నిర్ణయించలేదనేది చైనా వాదన. సంప్రదాయ సరిహద్దు రేఖపై ఇరువైపులా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్​ఏసీపైనా సాధారణ అవగాహన లేదు."

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

1962లో లద్దాఖ్‌లో చైనా 38వేల చదరపు కి.మీ మేర ఆక్రమించిందని తెలిపారు రాజ్​నాథ్​. అదే సమయంలో పాకిస్థాన్‌ నుంచి 5వేల చ.కి.మీ భూమిని కాజేసిందని పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చ.కి.మీ భూభాగం తనదని చైనా వాదిస్తోందని అన్నారు. అయితే, ప్రస్తుతం లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ రాజ్యసభకు తెలియజేశారు.

ఇరుదేశాల చర్చల్లో ఎవరేమన్నారు?

వాస్తవాధీన రేఖను గౌరవించడం, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నాలు చేయకుండా ఉండటం, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చైనాతో చర్చల సందర్భంగా భారత్ స్పష్టం చేసినట్లు చెప్పారు రాజ్​నాథ్. మరోవైపు ఈ పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతి, సమగ్రతను కాపాడాలని చైనా పేర్కొన్నట్లు తెలిపారు.

ఎల్​ఏసీ వెంబడి చైనా భారీగా బలగాలను సమీకరించిందని తెలిపారు. గోగ్రా, కొంగ్​కా లా, పాంగాంగ్ సరస్సు(ఉత్తర, దక్షిణ తీరం) సహా అనేక ఘర్షణ ప్రాంతాలు ఉన్నట్లు చెప్పారు. దేశభద్రతకు అనుగుణంగా భారత్​ సైతం అదే స్థాయిలో మోహరింపులు చేపట్టినట్లు వెల్లడించారు. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకే భారత్ కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు.

Last Updated : Sep 17, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.